Wednesday, April 13, 2011

................................PART-V



................................PART-V

ఇక మిగిలినవి విషపూరితమైనటు వంటి రసాయనాలు - పురుగుల మందులు, ఎరువులు లాటివన్నమాట.  ఇవన్నీ కూడ చాలా చాలాతక్కువ మోతాదులో, అంటే parts per million, billion, trillion (ppm, ppb, ppt) levels లో కూడ మనుషులకి చాలా హానికారకాలు.  కాబట్టి వీటి యొక్క పరీక్షలు చేసేటప్పుడు అతి జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది.  అయితే వీటిని పరీక్షించటానికి, అంటే ఇంత తక్కువ మోతాదులో చాలా highly sophisticated instruments (ఎంతో నాణ్యమైనటువంటి ఉత్తమ పరికరాలు) అవసరం అవుతాయి. వాటి మీద పరీక్షలు జరపటానికి సిబ్బంది కూడ మంచి qualifications, experience and subject understanding కలవాళ్ళై ఉండాలి.  అందుకే ఒక 5-6 సంవత్సరాల క్రితం వీటి యొక్క పరీక్షలకు గాను నీళ్ళల్లో, మనం త్రాగే carbonated drinks (pepsi, coca cola లాటివి) వాటిల్లో చాలా కష్టం అయింది, ఎంతో controversy కూడ జరిగింది.  అవన్నీ కూడ ground water, రైతులు వాడే పురుగుల మందులు, క్రిమికీటకాదులను నాశనం చేయటానికి గాను వాడే రసాయనాలు భూమిలో లోనికి ఇంకిపోయి, కలిసిపోవటం మూలంగా జరిగిందని కొన్ని పరీక్షాకేంద్రాలు కొన్ని వందల, కోట్ల పరీక్షలు జరిపాక తేల్చారు.  అదీ రసాయన పరీక్షలొక్కటి మూలంగా నే కారు.  వాటికి తోడు వాళ్ళు Environmental studies (పర్యావరణ) కూడ చేసారు.  తయారీ జరిగే ప్రాంతాలను సందర్శించి అక్కడ నుంచి కూడ samples సేకరించి వాటి యొక్క analysis చేసి అప్పుడు నిర్దీకరించటం జరిగింది.  అవి కంపెనీ లో తయారయాయో కనుక్కుని దేశం మొత్తంగా వాటి నుంచి వచ్చే bottles కలిసిపోకుండా ఆపి, వాళ్ళ నీరు శుభ్రం చేసి మళ్ళీ వాటి ఉత్పాదన మొదలెట్టుకునేలా చేసారు.  చూసారా!!  ఇదంతా కూడ రసాయన పరీక్షల వల్లే, వాటి యొక్క నాణ్యతా పరిమాణాలను పాటించటం వల్లే జరిగింది.  కాబట్టి తయారీ తరవాత నాణ్యతను నిర్థారించుకుని
 మరీ మార్కెట్లోనికి పదార్థాలు రవాణా చేయటం ఎంతో ఉత్తమమైన పద్ధతి.  అన్ని సౌకర్యాలూ ఉన్నటువంటి పరీక్షాకేంద్రాల్లో కొంత ఖ్ఖర్చు ఎక్కువ అయినా సరే పంపి చేయటం ఎంతో మేలు.

అయితే concentrated pesticides ఎక్కువ మొతాదులో ఉంటాయి కాబట్టి, గాఢత ఎక్కువ కల్గిన క్రిమికీటకాదులకు వాడే రసాయనాలు అలాగే తయరీ తరువాత అమ్మటానికి, అంటే రైతుకి అందించటానికి, దాన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళు ముందస్తుగా వాటి యొక్క పరిమాణాలను కూడ పరీక్షించటం జరుగుతుంది.  ఇవన్నీ కూడ IS Specifications ద్వారా చేయటం అవుతుంది.  ఇవి చేసేటప్పుడు పీల్చుకోకుండా, ముట్టుకోకుండా, అంటుకోకుండా జాగ్రత్తలు తీసుకుని చెయ్యాలి.  ఎంతో alertness కావాలి ఇవి చేయటానికి.

తీరా ఇవన్నీ వాడేసాక అవి నీటిలోనికి  భూగర్భం నుంచి ప్రవేశించాక పరీక్షలు జరపటానికి పైన వివరించిన విధంగా expertise కావాలి.  చాలా ఖర్చుతో కూడుకున్న పని.  అయితే రైతులు కూరగాయలు, పళ్ళు, ఫలాలు ముఖ్యంగా ద్రాక్ష పళ్ళులాటివి, గమనించే ఉంటారు, వాటి మీద వాడిన మందులు బాగా కడిగి, శుభ్రం చేసుకున్నాక కానీ భుజించకూడదు.  తరవాత మామిడి పళ్ళు ఒక బండి మీద Rs 15 కి ఇచ్చి నా మరో బండి వాడు Rs. 25 కి తగ్గడు.  ఎందుకో తెలుసా!! మొదటి రకంవి రాలిన కాయలు గానీ, పచ్చి కాయలు కానీ కోసిన వాటిని రసాయనాలు చల్లి పండించినవి.  త్వరగా కూడ పాడవుతాయి.  తినకూడదని కాదు కానీ, బాగా శుభ్రం చేసుకుని త్వరగా పూర్తి చేసేయాలి, నిలువ ఉండవు కాబట్టి.  అందుకే జామకాయలయినా, అరటి పళ్ళయినా,  ఆపిల్ పళ్ళయినా, ఏవైనా సరే ఒక్కసారి కడిగి అప్పుడు భుజించటం అలవాటు చేసుకోవాలి.  వర్షాకాలంలో మరి ఆకుకూరలు తినటం  మాననవసరం లేదు.  2-3 సార్లు చక్కగా ఎక్కువ నీటితో కడిగి .1% potassium permanganate నీటిలో కడిగి, మళ్ళీ నీటితో శుభ్రం చేసి వాడుకుంటే అందులో ఉండే క్రిమికీటకాల గ్రుడ్లు, మట్టిలోని చెత్తనుంచి వచ్చే రకరకాల microbial organisms నిర్మూలన జరుగుతుంది.  గ్రుడ్లు కూడ కడిగి fridge లో పెట్టుకోవాలి.  కూరలు, పళ్ళలాటివి కూడ శుభ్రం చేసి మరీ వాడుకోవాలి.  అలాగని చాదస్థంగా కాదు, ఒక అలవాటుగా, గబగబా.  అలా అని అదే జీవితంగా కాదు.  అలా అయితే వ్యక్తిని భరించలేం.  శుభ్రత కూడ ఒక limit దాటితే భరించలేని వేదన చుట్టూ ఉన్న వాళ్ళకి కదూ!!

కాబట్టి పురుగుల, క్రిమికీటకాల మందుల బారి  నుంచి శుభ్రంగా ఉండటం మూలంగా అవి micro levels లో మన శరీరం లోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడటం మంచిది!!!!!!!!!!!!!!!!!!!

..........................................................................................ఇంకాఉంది....మరి

No comments:

Post a Comment