అమ్మ కథలు - మూడవది
రెండర్థాలు
ఊళ్ళో పరంథామయ్యగారు పరపతి - పలుకుబడి గల పెద్దమనిషి. పెద్ద ఉద్యోగస్థుడిగా రిటైరై స్థిర పడ్డాడు. కాని ఆయనకి విధివిన్యాసం ఎప్పుడూ ఎదురు చుక్కే. ఒక్కగా నొక్క కొడుకు ప్రకాష్ కి చిన్నప్పుడే తల్లిపోతే తానే తల్లీ - దండ్రీ అయి పెద్దచేసి చదువులు చెప్పించాడు. వాడితెలివికి తగ్గట్టు విదేశాల్లో మంచి ఉద్యోగాలు వచ్చి రాణించేస్తున్నాడు. పెద్దాయనకి మాత్రం వాడికి ఎప్పుడెప్పుడు పెళ్ళి చేసి బరువు భాద్యతలు ఒప్ప చెప్పుదామా అని ఉంది. ఎందుకంటే ఆయన అపార ఙ్ఞాన నంపన్నుడు. ప్రఙ్ఞా పాటవాలు మీదే ధ్యాస. వాన ప్రస్థం చేరి, ఆపైన సన్యాసం స్వీకరించి తపోదీక్షలో నిమగ్నుడవ్వాలని తహ తహ. కొడుకు కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నాడు.
ఆసుదినం రానే వచ్చింది. ఏనిటంటే, air-port దగ్గిరగా పట్నంలో ఫైవ్ స్టార్ హోటల్లొ బసచేసారు పరంథామయ్యగారు. విమానాశ్రయం లో కొడుకు కోసం వెయిట్ చేస్తున్నారు. హఠాత్తుగా తన బాల్య మిత్రుడు అచ్యుతరామయ్యగారు కనపడ్డారు. ఇద్దరూ ఉక్కిరి బిక్కిరై పోతున్నరు. ఇంతలో విమానం రావటం - ఆజాను బాహుడు - అరవింద లోచనుడు ప్రకాష్ వచ్చి తండ్రిని చుట్టేసాడు. వెను వెంటనే ఒక అందాల సుందరి వచ్చి అచ్యుత రామయ్యగార్ని "నాన్నా" అంటూ వాటేసుకుంది. అందరి కళ్ళళ్ళో ఆశ్చర్యం - అద్భుతం. వీద్కోళ్ళు ఏమిటి? రెండు టాక్సీలు ఒకే హోటల్ కి!! పక్క - పక్క రూములే!!!
ఇంక పెద్ద వాళ్ళిద్దరికీ అన్ని సంవత్సరాల గాథల పరంపరలు. చిన్నవాళ్ళకి కాలేజీల కబుర్లు. ఉద్యోగాల ఊసులు. ఆనందం - అనురాగం. విదేశీ అనుభవాలు. స్వదేశీ సహవాసాలు. ఎప్పుడూ మొహామొహాలెరుగని వాళ్ళయినా జన్మజన్మల బంధంలా కలిసిపోయారు క్షణాల్లోనే. అబ్బాయి ఇంజినీరు - అమ్మయి డాక్టరు. పాపం వైశాలికి కూడ తల్లి లేదు. అదోరకం దైవ ఘటన. అయితే ఇదోరకం సంఘటన. దేవుడు ఏ క్షణంలో ఏంచేస్తాడో అనుకున్నారు. ఎందుకు చేస్తాడో అని కూడ అనుకున్నారు. అమ్మాయి తండ్రితో అబ్బాయి, అబ్బాయి తండ్రితో అమ్మాయి, మరి వారిలో వారు అన్ని రకాలుగా అన్నీ మాట్లాడేసుకున్నారు. భోజనాలు చేసి గుడ్ నైట్లు చెప్పుకున్నారు నవ్వుతూ.
ప్రొద్దుటే ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళాలి కదా!! కాని నలుగురి ఆలోచనలు ఒకటే అయ్యాయి. పద్దలిద్దరూ మనసులు కలిపి పెదవులు విప్పుకున్నారు. "Marriages are made in heaven" అంటే ఇదేనేమో అనుకున్నారు. పిన్నలిద్దరూ నలుగురికీ ఒకే టేబుల్ మీద బ్రేక్ ఫాస్ట్-స్వీట్ పాన్ లు ఆర్డర్ చేసారు. అంటే పూర్వం తాంబూలాలు అనేవారు. ఇరుపక్షాల వారికి కూడ "వెదకబోయిన తీగలు కాళ్ళకి చుట్టుకున్నట్లే" అయింది. జరగవలసిన శుభకార్యం అమ్మయిగారింట దివ్యవైభవంగా జరిగిపోయింది.
సకల పాంచనాలతో వైశాలి - ప్రకాష్ ని చేరుకుంది. పరంధామయ్యగారు తన ప్లాను ప్రకారం ఆస్తి వివరాలు - విల్లు తయారీ వగైరా లాయరు ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. కాని, ప్రకాష్ కి అర్జంట్ మెసేజ్. వెంటనే అమెరికాలో జాబ్లో జాయిన్ అవమని. చక చకా ఫార్మాలిటీస్ ముగించుకుని పెళ్ళాన్ని తీసుకుని చెక్కేసాడు. ముసలాయన మనస్సులోని మాట బైటకి రావటానికి కూడ తైము లేదు.
అప్పుడప్పుడు షోర్ట్ విజిట్స్ తో ఐదేళ్ళు అద్భుతంగా గడిచి పోయాయి. వాళ్ళకోగారాల వట్టి. "రవిప్రకాష్". వాడి ముద్దు మాటలు. అందాల ఫోటోలు. అన్ని దేశాల ఆట-బొమ్మలు. "రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా?" అన్నటుంది వైభవం.
ఒక రోజు పిడుగు లాటి వార్త తో ఇద్దరు మిసలి స్నేహితులు హఠాత్తు ప్రయాణం. అదే air-port. కడగండ్ల సుడిగుండం. గండ భేరుండమ్లాంటి విమానంలో ఇద్దరు ఓపిక తెచ్చుకుని నడుములు నిలబెట్టుకున్నారు. "డా. ప్రకాష్, డా. వైశాలి స్పాట్ డ్ త్. వాళ్ళ కార్లోనే ద్రైవింగ్ లో. రవి పోలీస్ కస్టడీలో", అర్జంట్ మెసేజ్ పట్టుకుని.
ఆఘ మేఘాల మీద అన్నీ ముగించుకుని రవిప్రకాష్ తో సహా ఇల్లు చేరుకున్నారు. అంత వరకూ చిక్క బట్టుకున్న అచ్యుతరామయ్యగారి గుండె ఇల్లు చేరగానే గుభేలు మంది. ఇంక అంత్యక్రియలే.
పరంధామయ్యగారు రాతి విగ్రహమే అయ్యారు. అవసరానికి మించి మాట్లాడరు. మౌనంగానే అన్ని పనులు చక్క బెట్టుకున్నారు. ఎప్పుడు ఎలా చేసారో గాని మనుమడికి ఎన్నో ఏర్పాట్లు చేసారు.
ఒక రోజు మనుమడిని వెంట బెట్టుకుని ఒక పర్వత మార్గంలో కనపడ్డారు.
"ఎక్కడుంటారు?" అని ఒక తెలిసిన అతను అడిగితే
"పైన ఆకాశం ఉంది - క్రింద భూమి ఉంది" అని ముక్తసరిగా చెప్పి చక చకా నడక సాగించాడు.
పాపం ఇతడు జాలిగా వెనక్కి వెళ్ళి "ఆకాశం బ్రద్దలై విరిగి పడితే - భూమి కృంగి పోతే ఏం చేస్తారు?" అన్నాడు.
"తండ్రే లేక పోతే కొడుకు లెక్కడుంటారు?" అన్నాడు ముసలాయన విసవిసానడుస్తూ!!
"నాకూ - నా మనవడికీ కూడ తండ్రి లేడనా" లేక "అందరికీ తండ్రి ఆ దేవుడే అనా" ఏమిటి యీయన భావం అనుకుంటూ ఇతడు ఇల్లు చేరాడు.
పర్వ తాగ్రంలో ఒక గుహలో మనుమడికి అన్ని వసతులు ఏర్పరచి, ఏటేఏఆ అన్ని సంబారాలు వచ్చేలా చూసి వంటరిగా ఉండటం నేర్పాడు. తాను కోరుకున్నట్లు యోగమార్గం పట్టాడు.
కథ కంచికి - మనం ఇంటికి
నీతి: ఈ కథలో రెండర్థాల మాటలు, సామెతలు ఎక్కడెక్కడ వచ్చాయో మీరే వెతుక్కోండి. ఇంకా కొన్ని కూడ చేర్చ గలమా!!!!
No comments:
Post a Comment