Wednesday, April 13, 2011

............................................................PART – VI




...............................................................PART – VI

వంట నూనెలూ, రకరకాల lubricating oils, petroleum, grease products లాటివాటికి కూడ రకరకాల పరీక్షలు ఉంటాయి.  వీటికి ASTM, IS methods, ఉంటాయి చేసే పద్థతులు వివరించటానికి.  అయితే ఇందులో viscosity, refractive index, fire point, pour point, flame T, corrosion, wearing by metals  లాటి వన్నీ tests ఉంటాయి.  చాలా చాలా పెద్ద machinery వాడేటప్పుడు oils వేస్తారు కదా joints మధ్యలో.  అప్పుడు ఆ ball and sockets మధ్యన  తిరగటానికి వేస్తారు.  అయితే అవి నెమ్మది నెమ్మదిగా కరిగి అఒందులోని metals ఈ oil లో చేరతాయి, కాబట్టి, కొంత కాలానికి ఆ oil చెడిపోతుంది, వాడటానికి వీలుకాదు.  ఇలా ఎన్నో రకాలుగా ఈ పరీక్షలు చేయవలసి వస్తుంది.  వాటికి మరి నాణ్యతావిలువలు పాటించకపోతే ఆ results సరిగ్గా ఉండవు.

మనం రోజూ వాడే నూనెలూ, తరవాత కొన్ని Ayurvedic medicines (మలామ్లు, తైలాలు, pain balms లాటి వాటిల్లో కూడ కొన్ని పరీక్షలు చేస్తారు.  వాటిల్లో మనకి హానికారకమైన fatty acids ఎన్నున్నాయి, మనకి ఎటువంటి oils తీసుకోవటం మూలంగా రక్షణ ఉంటుంది లాటి అంశాలు తెలియటానికి వీలుగా saponification value, iodination value లాటివి కూడ చేస్తూ ఉంటారు.  వేడి ఎంత ఉన్నప్పుడు అవి నిప్పు రాజుకుంటాయి ఏ temperature వద్ద గడ్డ కడతాయి లాటివి కూడ చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి దాని లక్షణాలు అంచనావేయవచ్చన్నమాట.  Crude oil, refined oil యొక్క  తేడాలను, వాటిలో ఉండే ఇతర పదార్థాలను, కలుషితాలను కూడ అంచనా వేస్తూ ఉంటారు.Crude oil ఇదివరకు వాడేవారు.  ఎక్కువగా నువ్వుల నూనె.  ఇది కాగేటప్పుడు మన అమ్మమ్మలు-బామ్మలు కొంచెం చింతపండు ముద్ద వేసి తీసేవారు.  ఆ నూనె కాగేటప్పుడు నురగవచ్చి, పొంగిపోకుండా.  అంటే refine చేసేవారన్నమాట.  ఇప్పుడు సోయా నూనె, ఫల్లీ నూనె తగుపాళ్ళలో కలిపి అమ్ముతున్నారు.  కానీ దానికింకా సోయా వాసన (కంపు) ఉండటం మూలంగా వాడుక కొంచెం కష్టం.  అలవాటు పడేవరకూ.



...........................................................................................ఇంకా ఉందండోచ్












No comments:

Post a Comment