Wednesday, April 13, 2011

....................................PART VIII


....................................PART VIII

ఇంక చాలా ముఖ్యమైన శాఖ; మనం ముందు గానే ప్రస్థావన చేసినది, వైద్యశాఖ. దీంట్లో డాక్టర్లు అందరూ ఆధారపడేది clinical analysis మీద.  ఇందులో biochemistry, microbiology, serology, haematology, immunology లాటి ఎన్నో మరెన్నో శాఖలు వాటిలో పరీక్షలు జరుగుతాయి.  రక్తం, serum, గోళ్ళు, మూత్రం, జుట్టు లాటి ఎన్నో శరీరంలోని పదార్థాలతో.  వీటి కోసం పరికరాలు సరేసరి చెప్పనలని కాకుండా ఉంటాయి.  దీనిలో అనేకులైనటువంటి శిక్షణాసిబ్బంది కూడ ఉంటారు.  క్షణాల్లో చెప్పాలి పరీక్షా ఫలితం.  దాని మీద ఒక పేషంట్ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది.  దాని ఆధారంగానే ఒక డాక్టర్ మందు ఏది తీసుకోవాలి, మోతాదు ఎంత ఉండాలి, ఎన్నాళ్ళు తీసుకోవాలి లాటి బేరీజులు వేస్తాడు.  అయితే ఆ యొక్క వ్యక్తి ఆ వ్యాధితో ఎలా యుద్ధం చేయాలన్నది కూడ ఈ పరీక్షల ద్వారానే జరుగుతుంది.  Glucose, cholesterol వంటి పరీక్షలు క్రమం తప్పకుండా చేసేవి,  కొంచెం అటూ, ఇటూ అయినా మోతాదు మారే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఇవి చేసేవాళ్ళు ఎంతో జాగ్రత్తగా చేయాలి.  అయితే మనకి సరి అయిన నాణ్యతా పరిమాణాలు పాటించకుండా చేసే pathology లేదా diagnostic centres చాలా  ఉన్నాయి   అన్నీ కూడ ఎంతో మెళుకువలతో చేయాలి.  అయితే ఈ పరీక్షలకు పరిమాణాలు ఇంతవరకూ కూడ ఇంకా ఏ American, Europian, వగైరా దేశాల పుస్తకాల్లోంచే చూసి చేస్తున్నాము. మన Indian పరిస్థితులకి సరిపడా ఉండే పరిమాణాలు లేవు.  దానికి కారణం ఎవరూ కూడInterlaboratory comparisons (ILC) కానీ, proficiency testing (PT) programmes లో కానీ పాల్గొనకపోవటమే కారణాలు.  ఇవన్నీ ప్రణాలికా బద్ధంగా జరిగినట్లయితే  పరిమాణాలు రూపొందించుకోవచ్చును.  అప్పుడు మన conditions కి, మన food habits కి, మన వాతావరణానికి, మన cultural conditions కి, సరిపడా ఆడ వాళ్ళల్లో, మగవాళ్ళల్లో, పిల్లల్లో, గర్భిణ్ణీ స్త్రీలల్లో ఇలా వేరు వేరుగా, ప్రాంతాల వారీగా ఈ పరిమాణాలను గుర్తించటానికి వీలవుతుంది.  దీన్ని బట్టి మన వైద్యవిధానంలో, వైద్యులు ఇచ్చేటటువంటి మోతాదుల్లో తేడాలు వచ్చి, site preference కి దగ్గరగా వచ్చి, side effects తగ్గి, సమూలంగా ఆ యొక్క వ్యాధులు నయమయ్యే అవకాశాలు  ఎక్కువగా కనిపిస్తాయి.

ఇవన్నీ కూడ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విరివిగా ప్రచారంలోకి వచ్చిన clinical trials కి కూడ ఎంతో దోహదం చేసి వచ్చే 20-30 సంవత్సరాల్లో ఎన్నో మరెన్నో చక్కని మార్పులు రాగలవని ఆశపుడుతుంది.

చూసారా!!!  పదార్థం ఏదైనా కావచ్చును.  దాని యొక్క పరీక్ష జరగటానికి ఎన్నో రకాల పరిమాణాల ఆవశ్యకత ఉన్నది.  అవన్నీ కూడ కొన్ని నాణ్యతా విలువలను పాటించ వలసి ఉన్నది.  అలా జరిగిన నాడు మానవాళికి  అన్ని వృత్తి విద్యలూ సమానంగా కనబడటమే కాకుండా ఈ అనవసరపు competition తగ్గి యువతను ఎంతో చక్కగా ఎవరిష్టం వచ్చిన బాటలో వారిని హాయిగా, సంతోషంగా సాగనీయటానికి దోహదం చేస్తుంది.




REFERENCES FOR ALL PARTS OF THIS ARTICLE:

1.     Packaged drinking water, IS 14543; 2004
2.    SSS Guide - .pdf file – www.al6xn.com/sssguide.pdf
3.    “The role of manganese fixing bacteria on the corrosion of stainless steel”, paper 151, corrosion 90, National Association of Corrosion Engineers.  Tverberg. J. C; Piccow. K and Redmerski. L.
4.    “What goes on in a pharmaceutical manufacturing environment and the subsequent need for clinical trials of the drugs that are produced”, International Biopharmaceutical Association, Newsletter, August 2008, Dr. G. Swarnabala.  www.ibpa.org
5.    Interlaboratory quality audit program for potable water assessment of method validation done on Inductively coupled plasma – atomic emission spectrometer (ICP-AES), Accreditation and Quality Assurance Journal 2003, 8: 21-24, G. Anand kumar, H, S, Sahoo, S. K. Satpathy and G. Swarnabala.

…………………………………………………………………………









...........................................................................................అయిపోయింది.....................







No comments:

Post a Comment