Sunday, April 24, 2011

కబుర్లు....


కబుర్లు....




అమెరికాలో


"మనం ఎంత చేసినా ఇంకా చేయించుకోవాలనే చూస్తారు.............. మనం రెండింతలు పని చేస్తే,  వాళ్ళు తమ వాళ్ళ కిచ్చే దాన్లో సగం చేతిలో పెడరారని ప్రతీతి"...... అంటాడు.


కానీ   ఇండియాలో..............


"కూడ అదే కదా................." అనినేనంటాను....


"నీవు  నీకే సమాదానం చెప్పుకోగలగాలి".......


"టాక్ట్ ఫుల్" గా ఉండటం అంటే........."అబద్ధాలు ఆడటం"................... కదూ............................




జనవరి పద్ధెనిది......... ఇరవై పది


ఈ నెల ముఖ చిత్రం చూడగానే మొదలెట్టాను చదవటం.  మీ సంపాదకీయం చదువుతూ మల్లదివారి నలభై సంవత్సరాల క్రిందటి రచన పేరు చూసి వెంటనే  మొదలుపెట్టాను.  అది "మిసెస్ పరాంకుశం". అదలా చదువుతున్నానన్న మాటే గానీ, మనసు కుదురుగా లేదు.  ఏదో చాలా తెలిసినట్లుగా ఉంది.  అందులోని మాటలు చాలా పరిచయం ఉన్నట్లుగా అనిపిస్తున్నాయి.  అంతే ఒక్కసారి ఠక్కున తట్టింది.  "మా ఆయనా - పరాంకుశం గాడు" అమ్మ శీర్షిక తో నాయొక్క అనుభవాలు వ్రాయాలని అనిపించింది.  అందుకే లావుంది అందరూ రచనలు చదవండి, అంటారు.  అయిడియాలు వస్తాయని.  


"ఒక అయిడియా జీవితాన్నే మార్చేస్తుంది" అన్నది "అయిడియా" సెల్ వాళ్ళ ఆడ్ అయినా, ఎంతో నిజం.  నన్నిలా ఈ ప్రతి వ్రాయటానికి ప్రేరేపించింది.


మా పెళ్ళి అయిన క్రొత్తల్లో (పాతికేళ్ళ క్రితం) మొదలు.  ఇంకా ఇప్పటి వరకూ కూడ మా ఆయన ఎప్పుడూ తను చెప్పదలుచుకున్నది ఇండైరెక్ట్ గా 


"మా పరాకుశం ఆడు చెప్పాడు" అని అంటూ ఉంటారు.  
"వాడెవడు" అంటే, అదోలా నవ్వుతూ గుండెలు మీద చెయ్యేసి "మేమే" అంటారు.


ఎన్నో చెలోక్తులూ, చెమక్కులూ, మరెన్నో సరదా అయిన మాటలు, రకరకాల నవ్వు పుట్టించే డైలాగులూ, కడుపుబ్బ నవ్వించే మాటలూ, ఒకటేమిటి, అందరూ తనకోసం వచ్చేవరకూ నిరీక్షించటమే.  అప్పటికప్పుడు జోకులూ, నవ్వించే మాటలూ...... ఇదీ వరస.
ఏదైనా "ఫంక్షన్" కి వెడితే తనకి ఏ కేసో ఉండి రావటం లేట్ అయితే మా బావగారు అసహనంగా అటూ ఇటూ తిరుగుతూ ఉంటారు  "వీడేడి" అంటూ.
అందరూ చేతులు కట్టుకుని, బొజ్జ మీద ఆనించుకుని అలా కుర్చీల్లో, ఏ కదలికా లేకుండా, కార్పొరేట్ సంస్థల్లోని ఏసి రూంలోని ఉద్యోగుల్లా, కూర్చుని ఉంటారు తనొచ్చే వరకూ!!!


పెళ్ళైన తరవాత అవన్నీ "ఒరికినల్ జోక్సోయ్"  మరి నీలాటి వాళ్ళే ప్రక్కన ఉండి వ్రాయాలి" అని నన్ను చంపేసేవారు.  అవి సందర్భానుసారంగా ఉండేవి కావున కొంత కష్టమే వ్రాయటం.  అయిఆ కొంత వ్రాసి, కొంత మానేసాను.  మళ్ళీ ఇప్పుడు మల్లదివారి రచన చదువుతుంటే, నెలనెలా వ్రాయాలన్న బలమైన కోరిక కవిగింది.  జీవితంలో చిన్న చిన్న విషయాలయినా గబుక్కున ఒక్కోసారి వంటనే తట్టవు.  ఇదిగో ఇలా ఎప్పుడో, సడన్ గా, అనుకోకుండా............


ఈ పరాంకుశమేనా తను అనేది, లేదా ఈ "కారెక్టర్" ప్రభావిత మయిన తనలోని మరో మనిషా, అసలీ కథ తను చదివే అన్నారా, తెలియదు కానీ మొత్తానికి దీనితో ముడివడినదే అని అనిపిస్తుంది.  నేను మాత్రం ఈ ఊపున వ్రాయటం మొదలెడతాను. అందుకే ఈ ఉత్తరం మాత్రం వ్రాస్తున్నను. అది వ్రాసినా వ్రాయక పోయినా........... ఇలా ఎందరినో ఎన్నో రకాలుగా ప్రేరణ కలిగించే విధంగా మీ/మా కౌమిది ఉండాలని ఆశిస్తూ..........





No comments:

Post a Comment