Wednesday, April 13, 2011

...................................................PART VII



...................................................PART VII


ఇవిలా ఉండగా ఇక మన dairy products కి కూడ పరీక్షలు జరుగుతాయి తెలుసా!!  వాటిని మనందరం చాలా చాలా routine గా consume చేస్తాం కాబట్టి చాలా జాగ్రత్తగా, అతి క్షుణ్ణంగా వాటి యొక్క పరిశోధనలు/పరీక్షలు చేయటం ఎంతో ముఖ్యం.  వాటిలోని fat, protein, water, microorganisms, acidity లాటి పరీక్ష లెన్నో జరుగుతూ ఉంటాయి.  మనం త్రాగే పాలు dairy ల నుంచి వచ్చేవి మిశ్రమమైన పాలు అంటే ఆవు, గేదె, మేకలవి కలిపినవి.  కాక మిగిలిపోయిన పాలని పాల పొడి గా చేసి ఉంచుతారు.  దాన్ని కూడ కలిపి homogenise చేసి అమ్ముతారు.  Pasturize మాత్రమే చేస్తే  పొడి కలపని పాలన్న మాట.  ఇవన్నీ కూడ నాణ్యతా ప్రమాణాలు పాటించి వాటి యొక్క నిర్థి ష్టమైన పరీక్షలు చేసి అమ్మబడతాయి, కాబట్టి బాగుంటాయి. అయితే పాలవాళ్ళు అమ్మే పాలు, గేదెలూ, ఆవులూ ఉన్నవాళ్ళు బాగానే అమ్ముతారు.కాకపోతే దూరం నుంచి (ఊళ్ళ నుంచి తెచ్చి) సిటిల్లో విక్రయించే వాళ్ళు పాలల్లో రకరకాల పదార్థాలు కలుపుతారు.  నిలువ చేయటానికి, విరిగిపోకుండా ఉంచటానికి.  ఎండాకాలంలో తక్కువ పాలిచ్చి నప్పుడు సరిపడక రకరకాల పౌడర్లు అందులో కలుపుతారు.  చిక్కగా ఉన్నాయని చెప్పటానికి urea, DDT లాటి వెన్నో అందులో కలపటం జరుగుతుంది.  ఇవన్నిటినీ కూడ పరిక్ష చేయవలసి ఉంటుంది.

ఇవన్నీ కాక పాలనుంచీ తీసే వెన్న, నెయ్యి, పెరుగు, పాలకోవ (మైదాపిండి కలుపుతారు) వంటి ఎన్నో పాలతో తయారు చేసే పదార్థాల సంగతి చెప్పనవసరం లేదు.  ఊహకందని రీతిలో వీటిలో రకరకాల పదార్థాలు కలుషితం అవుతాయి.

ఎర్రకారం లో రంపపు పొట్టు లాటివి కలుపుతారని వినే ఉంటారుగా!!  ఇలా కలుషితమైనటు వంటి పదార్థాలను చూడటం, పదార్థాల యొక్క నాణ్యతలు కూడ పరీక్షించటం జరుగుతుంది.  మరి పరిమాణాలు ఉన్నా వాటిని అమలు వరుస్తున్న దెంతవరకో మీరే ఊహించుకోగలరు!!

ముఖ్యంగా ఈ పాల ఉత్పత్తిదారుల యొక్క వ్యాపారాలు చూస్తే రసాయన పరీక్షాకేంద్రాలు ఎన్నో మరెన్నో ఉండి నాణ్యతా పరిమాణాలను ఎంతో పెంపొందిస్తే బావుంటుందని అనిపిస్తుంది.  వాటి యొక్క ఆవశ్యకత అర్థం అవుతుంది.

...........................................................................................................................ఇంకొంచెం ఉంది.







No comments:

Post a Comment