Monday, April 25, 2011

baabaayi - nenu



మా బాబాయి నాగురించి......... నాతోనే ఫొన్ లో నవ్వుతూ....... టిపికల్ గా ఉంటుంది............చెప్పిన విశేషాలు..కాలక్షేపం  కబుర్లు - ఒంటరి గా ఉన్నానని ఫోన్ చేస్తాడు.........  [వారానికోపూట, ఎక్కువగా గురువారమో, శుక్రవారమో  మా అత్తగారు, అప్పుడప్పుడు ఙానేశ్వర్ గారు కానీ, మా చిన్న వదిన గారు చేస్తూఉంటారు]




"మా బుజ్జమ్మ - దానిల్లు.........హ హ హ"


నేను విశ్వనాథశాస్త్రిని.  బుజ్జమ్మ మా అన్నయ్యగారి పెద్ద కూతురు.  దాన్ని పుట్టినప్పుడు చిన్నదిగా ఉండేదని మేమంతా కూడ"జపాన్ టాయ్" అని అనే వాళ్ళం.  ఓ పిన్ క్ గౌను వేసుకుని, ఒక ఇంగ్లీషు టోపీ (ఎగ్జిబిషన్ లో కొన్నాం) పెట్టుకుని బొమ్మలా ఉండేది.


అది అబ్బో ఇప్పుడు  బోలెడు చదువులు చదివి, విదేశాల్లో తిరిది వచ్చింది.  దాని మొగుడు డాక్టరు.  అదో పేద్ద ఇల్లు కట్టించిందిలే.


"అక్కడంతా తిరిగొచ్చి, చూసొచ్చి, అంత పెద్దిల్లు కట్టేసిందిరా!!"  అన్నాడు మా అన్నయ్య ఓసారి నాతో.  "నేను అప్పుడప్పుడు వెడుతూ ఉండేవాణ్ణి రిటైర్ అయ్యాక".
వదిన భోజనం చేసి గాని వెళ్ళనిచ్చేది కాదులే.  సాయంత్రం వరకూ ఉండి అప్పుడు వెళ్ళేవాణ్ణి.  ఎంతో సంతోషించేవారు. " ఓ పేద్ధ భవనం లాటిల్లు కట్టేసింది, మరి అనుభవం లేదుగా!!!" అనుకునేవాళ్ళం.


"పాపం వాళ్ళాయన గల్ఫ్ లో సంపాదించిందంతా పెట్టేసి కట్టేసింది, ఓ ప్లన్నింగూ  మన్నూ లేదనుకో, డబ్బన్నాక సంపాయించాలి, కాస్తోకూస్తో వెనకేసుకోవాలా.  అంతా తగలేస్తేఎలా" అనుకునే వాళ్ళం మేమంతా.  "దాందీ మా అన్నయ్య పోలికే" తనూ కెరీర్ సరిగ్గా చేసుకోక, సంపాయించింది వెనకేసుకోక  ఇబ్బందులు పడ్డాడు.  వచ్చింది వచ్చినట్లు ఖర్చు చేసేసుకునేవాడు".


ఇదీ అంతే "సంపాయించుకోలేక పోతామా" అనుకుందిట పిచ్చిది.  ఇల్లు కట్టిననాటికి ద్దనికీ చిన్న వయస్సే.  అలా అని పోనీ దానికి సలహా ఇవ్వటానికి మా అన్నయ్యాకీ లోక ఙ్ఞానం ఎంతో లేదు, శూన్యమే.....తనూ కట్టలేదుగా!!"


స్థలం ఎప్పుడో కొన్నారుట. అదీ చూసుకో లేదు.  ఏదో కోర్టు కేసులో ఉంది.  అక్కడికి జంట నగరాల్లో సాఫీగా దొరొకే స్థలాలున్నట్లు.  క్రింద  వంటిల్లూ, డ్రాయింగూ, డైనింగూ కట్టి, ఇంటి మధ్యలో మెట్లు పెట్టి, పైన స్టడీ, హాలు, రెండు బ్ డ్ రూమ్ లు, ఓ బాల్కనీ కట్టించేసింది.


దాని మొగుడు వెదేశాలనించి వచ్చి చూసి విస్తుపోయాడుత.  మరి ఆ ఇంట్లోకి కావలసిన వస్థువులూ గట్రా కొనటానికి కూడ డబ్బు మిగల్లేదుట.  అయితే అప్పులేంలేవు. అదొక్కటీ సంతోషం" అన్నడని చెప్పుకున్నారు.
పాపం ఆ అబ్బాయి  మంచివాడు కాబట్టి "సరేలే" అని మళ్ళీ బ్రతుకు తెరువుకి మంచి ఉద్యోగం వెతుక్కునే పనిలో పడ్డాడు.


పైగా ఊరుకుందేమిటి?  "ఇంత కొంచెం సంపాదిస్తావని నేననుకోలేదు, బాగా డబ్బు గడిస్తావని అనుకున్నాను, నేను బాగా సంపాదించగలను అని సవాలు చేసిందిట" దాని మొహం దానికీ ప్రపంచం గురించేమి తెలుసు......"  అని అనుకున్నారుట.......




అన్నీ విని, నిజమే కదా........... ఒప్పుకుని..... తెలుసుకోటానికి ప్రయత్నం చేస్తూ.............






















No comments:

Post a Comment