Tuesday, February 11, 2014

WINTER ARTS INTENSIVE AT CHINMAYA NAADA BINDU, KOLWAN, PUNE

పందొమ్మిది వందల తొంభై ఏడు తరవాత ఎందుకో తెలీదు కానీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయ్అంతకు ముందున్న ఆనందం, సంతోషం, ఎగిరే పక్షిలా ఉన్న మనస్సు, అన్నీ తెలుసు, అన్నీ చేయగలను, నావల్ల ఎలాటి తప్పూ జరగదు, ఏదేనా చేయగలను, సాధించ గలను అన్న ఆత్మవిశ్వాసం నెమ్మదిగా తగ్గుతూ వచ్చింది. జయాలు కలిగినా, కొన్ని చిన్న సంఘటనలు, కొన్ని అనుకోని అవాంతరాలూ చెట్టు మొదళ్ళు కదిలేలా చేసాయిఆత్మవిశ్వాసాన్ని భంగపరిచి, స్థానే ఉద్వేగం చోటుచేసుకుని మనస్సుని ప్రతీ పనికి ప్రశ్నించటం మొదలెట్టాయి.

పదిహేను-పదహారు సంవత్సరాలు సంఘర్షణ తరువాత ఒకరోజు నేనుఫేస్ బుక్" లో చూసిన ఒక చిన్నఈవెంట్మార్చేసింది నా ఉదాసీనతని, గెలిచింది నా మనస్సునిఅదేవింటర్ ఆర్ట్స్ యింటెన్సివ్గా "చిన్మయ నాద బిందు" లో పోయిన సంవత్సరం 15-21st డిసెంబరు వరకూ జరిగిన ఈవెంట్. వారం రోజుల్లో జీవితానికి శ్వాంతన, శ్వాలంబన కలిగి, ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగించ గలిగిన సంఘటనలు జరుగుతాయి అనటానికి సంకేతం ఇదే!!

గత సంవత్సరం జూన్ నుంచి మా అమ్మాయి చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగివచ్చింది. నాట్యాన్ని కొంత మెరుగులు దిద్దుకోవాలి అనుకునివచ్చిన సమయంలో కొన్ని విధాలుగా దాని మూలాలు పెరికేయబడి కొంత సంక్షోభం నెలకొంది. ’మాన్ సూన్ ఇంటెంసివ్కి వెళ్ళాలని అనుకుంది కానీ, ఇతరత్రా వచ్చిన పనులతో ఆగిపోయిందిమాభగవద్గీత పారాయణకార్యక్రమం కొంత ఊరటనిచ్చింది. సరే తనువింటర్ ఆర్ట్స్ యింటెన్సివ్కి అప్లికేషన్ వేసింది. అయితే మా ఆయన నన్నూ ప్రోత్సహించి వెళ్ళు, కాస్త మార్పు వస్తుంది అన్నారుఅయితే ఖర్చుకి ఆలోచిస్తున్న నాకు అయిదు రోజులు సెలవు లేదనీ, తీసుకుంటే జీతం కట్ చేస్తామన్నారు ఆఫీసులోమరందుకేనేమో తప్పకుండా వెళ్ళాలి అనుకున్నాను. జీవితంలో ఎన్ని చేసినా, ఏమి చేసినా దానికి విలువడబ్బేకాదన్నది, మనకోసం, మన ఆనందం, సంతోషం కోసం కూడా సమయాన్ని కేటాయించాలనీ కూడ అనిపించింది.

అంతే తనతో పాటుగా నేనూ అప్లికేషన్ వేసేసానుఇద్దరం ఒకరోజు ముందురావాలనీ, రాత్రి డిన్నర్ టైమ్ కి డైనింగ్ హాల్ లోరమా భరద్ వాజ్గారిని కలవాలనీ అన్న నియమానికి బయలుదేరి పూణే వెళ్ళాం. ప్రొద్దున్న మానీస్ వాళ్ళ యింటికి వెళ్ళాం. భోజనం పెట్టి, తిప్పి, సాయంత్రం సపరివారంగా మమ్మల్నికోల్ వాన్ డ్రైవ్ చేసి తీసుకెళ్ళారు. అక్కడి వాతావరణం, కొండలు, గుట్టలు, ఆహ్లాదంగా ఉన్న ప్రదేశం చూసి, వెన్నెల్లో అందాలు ఆశ్వాదించాం.

వారిని పంపి, డిన్నర్ దగ్గర రమక్క గారిని కలిసాంఅక్కడే ఆమె మాకుహోమ్ వర్క్ఇచ్చారు.  ఒకగణేశ స్తుతిఇచ్చి అందరిని ఒక్కొక్క లైన్ చొప్పున కోరియోగ్రాఫీ చేసుకుని తెల్లారి ఆరు గంటలకల్లా కలవమన్నారుఅర్ధ రాత్రి వరకూ చూసుకుని, పడుకుని, తెల్లారి స్నానాలు చేసి (వేడి నీళ్ళుటాప్లో వచ్చాయి లేండి), చలిలో వణుకుతూ కలిసాంఒక రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న గణేష్ మందిరానికి వెళ్ళాంపూజ చేసి, తరువాత మేమందరమూ కలిసి, ఆమె పాడుతూ, తాళం వేస్తుంటే (నత్తువాంగం) గణేష్ స్తుతి చేసేసాం దేవుని ముందరఎంతబాగా వచ్చిందో చెప్పలేనునాకున్న సంశయాలన్నీ పోయాయి, ఎంతో బాగా అనుకున్నది అనుకున్నట్లు చేసేసానుఆనందం వేసిందిఅదే ప్రాంగణంలో ఆమె మాకు నమస్కారం, మొదటి అడుగులూ కూడ వేయించారుప్రాణాయామ ప్రక్రియ కూడ చెప్పించారు మాతో.

దేవాలయాల్లో మధ్యగాతాబేలుఎందుకు పెడతారో కూడా వివరించారుతాబేలు వివేకానికి, విశ్వాసాల నుంచి దూరంగా ఉంటూ, తనని తాను రక్షించుకోగలిగి, వైరగ్యంతో ఉండే ప్రాణి కోటికి ప్రతీక. ఒక యోగి ఎలా ముడుచుకుపోయి తనలో తానుమెడిటేషన్చేస్తూ ఉంటాడో, అదే విధంగా తాబేలు చుట్టూ ఉన్న ప్రాపంచిక విషయాల నుంచి మరియూ వాటి తాలూకు ఆలోచనలనుంచి కూడా దూరంగా ఉంటుంది. ఇంకొక విషయం కూడా అది  గుడ్లు పెట్టినప్పుడు, వాటిమీద కూర్చోకుండా వాటినే అలా చూస్తూ ఉంటుంది. అల్లాగే మనం కూడ దేవుని విగ్రహాన్ని వీక్షించి, అందులోనుంచి వచ్చే ఆద్యాత్మిక శక్తి ని దర్శనం ద్వారా పొందాలని కూలంకషంగా వివరించారావిడ.

తరువాత ప్రమోదిని రావు, హిమాంషు నంద గార్లచే ధ్యానం క్లాసు అయింది. తరువాత మా క్లాసు లో మాకు అడవులు నేర్పించి వాటిని గురుతుంచుకోటానికి ఒక కూర్పు రెండుగా విడిపోయి చేసికోమన్నారు ఆమె. శివుని పంచాక్షరీ స్తుతి ఒకటి, మాలోనే ఒక అమ్మాయి పాడుతూ హార్మోనియం వాయిస్తుంటేకోరియోగ్రాఫిఎలా చేసికోవచ్చునో వివరంగా ఒక్కొక్క పదాన్ని విడదీసి చేసి చూపించారు ఆమె. దీనిలో నవ రసాలూపలికాయిచాలా బాగా వచ్చింది పాట.

మరునాడు మేము ముందుగా ప్రమోదిని గారిఓం కారసాధన కి వెళ్ళాముఆమె ఒక్కొక్కరితో విడి విడిగా ఓంకారం చెప్పించారు. ఎంత బాగుందోగొంతెత్తి అలా ఓంకార శబ్దాన్ని పలుకుతుంటే అప్పటివరకూ ఉన్న సిగ్గు, బిడియం పోయి, ఏదో శక్తి లోనికి ప్రవేశించినట్లు గా అయిందివంట్లో ఉన్న జలుబులూ, దగ్గులూ అన్నీహుళక్’............ యోగా చేసినట్లుగా, ప్రాణాయామం చేసినట్లుగా అనిపించింది. ఇంకా చేయిస్తే బాగుండునురోజూ వేళ్ళాక చేసుకోవటానికి తర్ఫీదు ఇస్తే బాగుండేదేమో కూడా అనిపించిందిమరోనాడు వెళ్ళినఫుడు ఆమె రి - సరళీ స్వరాలుఓంకార నాదంలో పలికించారు. వాటిని రకరకాలగ్రాఫులమాదిరి తిప్పుతూ పలకటం ఒక ఆటలా అనిపించి తమాషాగా అనిపించిందిఅలాటి సాధన రోజూ చేసికోగలిగితేఆరోగ్యమే మహా భాగ్యం కాదా.

సరళీస్వరాలు అంటే గురుతు వచ్చింది. ’రమక్కమాకు క్లాసులో ఏదో వివరిస్తూ ఆమె వ్రాసినస్వరాభీశ్వరంఅన్న వ్యాసం గురించి చెప్పారు.  అందులో ఆమె రి ని స్వరాలను నాట్యానికి అణుగుణంగా మలచి కొన్ని వివరణలు ఈయటం ఒక గొప్ప విశేషం. ఆమె నాట్యశాస్త్రం లోంచి హస్తాలు, ముద్రలు, నవ రసాలు, అష్టవిధనాయికలు, నాయకులు, భావాలు, అందులో స్తాయీ, సంచారీలు, విభావాలు, ఇలా ఎన్నో విషయాలన్నింటినీ కూడ చేయిస్తూ నేర్పారుమరెన్నో వీడియోలు కూడ చూపించారు. ముఖ్యంగారమా వైద్యనాథన్చేసిన చిన్ని కృషునికి యశోదశ్రీ రామ జననం కథలా చెబుతూ భోజనం పెట్టటం ఎంతో ఆనందింపజేయటమే కాకుండా ఆలోచింపజేసింది కూడామా యొక్క ముంముందు ప్రదర్శనలకి చక్కని ఉదాహరణ, ఒక విధంగా అనుకరణకి అవకాశం కూడాఫ్లూట్ మరియు ఓకల్ స్టూడెంట్స్ కి ఆమె ఒక డెమో క్లాసురిథమ్మీద తీసుకున్నారుఅందులో ఎన్నో రకాలుగా జతులు తాళ లయ గతులు చక్కగా వివరించారు.

         మాకు ఆమె అభినయం మరియు ఇంప్రోవైజేషన్ మీద ఈ వర్క్ షోప్ పెట్టారు కాబట్టి ఒక మంచి పదాన్నిఎన్నుకున్నారు నేర్పటానికి. మాలై పొళుతునిలే ఒరునాళ్అనే టమిల్ పదం”.  ఆమె ఎంత చక్కగా నేర్పారంటే చివరిదాకా అందులోని సస్పెన్స్ తెలీలేదు.  దానిని ఎంత బాగా ఎంపిక చేసికొన్నారంటే, తన క్లాసులో ఉన్న ఎరవై నుంచి యాభై వాళ్ళు, మరియు ఒక అబ్బాయి కూడా చేయగలిగేలా ఉంది.  నేను పదం నేర్చుకోవాలని ఉబలాట పడ్డాను, నేర్చుకోగలిగాను కూడ.  కాకపోతే ఎందుకో ప్రదర్శన చేయటానికి నాకు సమయం తక్కువ అయింది కాబోలు, అది టమిల్ లో ఉండటంతో.  ఇంటికి వచ్చాక చేసికో గలుగుతున్నాను రొజూ.  ముగ్గురిని ఎంపిక చేసి చేయించారు. 

ఇక రమక్క గారు ఎంతో ఓపిగ్గా, చాలా చాలా నైపుణ్యంతో, నేర్పుగా, ఒడుపుగా నృత్యాన్ని మాకు కోరియోగ్రాఫీ చేసారు.  పదంలోని ఒక్కొక్క మాట వ్రాసి దాని యొక్క అర్ఠం ఇంగ్లీషులో రాసి, చాల సవివరంగా వివరించారు.  పైగా దాన్ని ఎన్నో కోణాల్లో నర్తించి చూపించారు.  అదే ఒక పదాన్ని ఎన్ని రకాలుగా చేయవచ్చునో చెప్పటమే కాక, ఎలా చేస్తే దాని అర్థం ఎలా ఉంటుందో చేసి చూపించారుఅంటే ఆ నృత్యాన్ని ఏ నర్తకి కా నర్తకి తనకి అణుగుణంగా మార్చుకునే అవకాశాన్ని అందించి ఎవరికి వారు దాన్ని తనదిగా మలుచుకునేలా వివరించారుక్లాసులో ఉన్న పది మందీ కూడా దాన్ని పది విధాలుగా చేసి చూపేలా వీలయిందిఎవరు చేస్తుంటే అది వారి కోసమే అలచి నట్లుగా ఉంది.

ఈ రకంగావింటర్ డాన్స్ ఇంట్ంసివ్నా మనస్సులో ఒక చెరగని ముద్రవేసి, నేను మళ్ళీ జీవితంలో ఉత్సాహాంగా, ఉల్లాసంగా అవటానికీ దోహదపడటమే కాకుండా నన్ను మళ్ళీ మా అమ్మ మొదలెట్టి వదిలేసినశ్రీ జ్గాన సుందరీ సంగీత నృత్య అకాడమీతిరిగి మొదలు పెట్టాలన్న కోరికకి బలం చేకూర్చింది అనటానికి అంటెఏ అతిశయోక్తి  కాదుచేసినా చేయక పోయినా ఆ ఉత్సాహం మాత్రం వచ్చిందిమరొక్క సారి రమక్క గారికి నా కృతజ్గ్నతలు మరియు శుభాకాంక్షలు.
.....................................................ఊఊఊఊఊఊఊఊఊ........................




No comments:

Post a Comment