Tuesday, May 29, 2018

తెలుగు వారి లాస్య-తాండవ నర్తన రీతులు


త్యాగరాయ గాన సభలో 25.05.2018 నాడు నవ్య నాటక సమితి మరియు అన్నమయ్య మిషన్ ఆధ్వర్యం లొ జరిగిన సదస్సులో "తెలుగు వారి లాస్య-తాండవ నర్తన రీతులు" అనే అంశం మీద డా. సువర్చలాదేవి గారు, పేరిణీ కుమార్ గారు ఆంధ్ర నాట్యం మరియు పేరిణీ శివ తాండవం గురించి వివరించటం జరిగింది.  వారి వారి శిష్యులు నాట్యం చేసి ప్రదర్శించారు. 
సదస్సు 6 జూన్ పద్మశ్రీ శ్రీ నటరాజ రామక్రిష్ణ గారి 8 వర్ఢంతి సందర్భంగా నిర్వహించటం మూలంగా ఆంధ్ర నాట్యం మరియు పేరిణీ లకి ప్రాముఖ్యత ఈయటం జరిగింది.
ముందుగా డా సువర్చల గారు ఆంధ్ర నాట్యం లోని లాస్య రీతుల గురించి మాట్లాడారు. గురు రామక్రిష్ణ గారు తమ ఊహాశక్తి ని వాడి, దేవాలయాల్లోని శిల్పాలను చూసి, ఇవి ఎలా వచ్చి ఉంటాయి అని ఆలోచన చేసి ఆయా శిల్ప కళాకృతులను మరిపించేలా నాట్య భంగిమలను చొప్పించి నాట్య రీతులను క్రమభద్రీకరించారని వివరించారు.
ఆధ్యాత్మికతకు ఓం కారమే ప్రధానం.  నృత్య రీతులలో వాడే "తాం తాం తాం...." అనే శబ్దమే ఓంకారం జనింపచేస్తుంది కాబట్టి నాట్యం కోవకు చెందిందే అన్నారు.  "తెలుగు భరత నృత్యం", "తెలుగు ఆంధ్ర నృత్యం" లేదా "ఆంధ్ర నాట్యం" అని నామకరణ చేయాలని 23 Aug 1970 లో జరిగిన సదస్సులో సర్వే మాణిక్యంబ గారు, అన్నాబత్తుల వారు, నటరాజ రామకృష్ణ గారు లాస్యాభినయం, ఆధ్యాత్మిక రామాయణం మొ!! అంశాలను ప్రదర్శించగా తిలకించి, "ఆంధ్ర నాట్యం"  అని పేరు నిశ్చయం చేసారు.  కూచిపూడి సదస్సులో సంస్కృతం లోని పదాలకి అభినయించిన తీరు, వాటికి వ్యాఖానించిన తీరూ చూసి, సంగీత నాటక ఆకాడమీ వారు తెలుగులో ఇంత సాంప్రదాయం ఉందా అని ప్రొత్సహించారు.  మళ్ళీ 1974 లో జరిగిన సదస్సు  నృత్త ప్రధానమై, అంగ విక్షేపంగా ఉండి దార్శనీయంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. తిరిగి 1982 లో శ్రీశైలంలో చేసిన సదస్సు తో ఆంధ్ర నాట్యానికి వన్నె తెచ్చింది. ఆయన యొక్క philosophy “sound and vibration”.  ఆయితే తరవాత ఇది "తెలుగు విశ్వవిద్యాలయం లోకి కలిపివేసారు.
రాధాకుమారి గారు, ఉమారామారావు గారు, సుమతీకౌషల్ గారు మొ!! వారు మొదటి జనరేషన్; కళాకృష్ణ గారు లాటివారు రెండవ జనరేషన్ వారు, మరియు సువర్చలాదేవి వంటి వారు మూడవ జనరేషన్ వారు క్రింద లెఖ కట్టవచ్చుననీ అభిప్రాయపడ్డారు. ముఖలింగ క్షేత్రం నుంచి తెలంగాణలో అన్ని దేవాలయాల్లో ఆంధ్ర నాట్యం ప్రదర్శితమైనదనీ చెప్పారు. 
ఆగమ నర్తన విధానం లో "కుంభ హారతి" చేసి రంగస్థలం పైకి వస్తారనీ చెప్పారు.  తరువాత "చూర్నిక", "నవ సంద్య" మార్గ పద్ధతి లో అందరు అషట దిక్పాలకులాకుల ముందు అన్ని చోట్లా చేసి అప్పుడు నాట్యారంభం చేస్తారు.   "కైవార గీతాలు", శబ్దం", ఏక తాళ జతులూ ఉండేలా నాట్యం చేస్తారని చెప్పారు. సమ తాళ జతులు - 13, 15 అక్షరాలతో  చేస్తారు.   సాయంకాలం ప్రదర్శనలు నృత్తం తోనే ఆరంభం అయ్యేవనీ, అంగ విక్షేపాల తో కొంత శరీరం తేలికై నృత్యం చాలా బాగుంటుంది చూడటానికి అని అన్నారు.  చివరగా కొద్దిగా "సర్వే మాణిక్యాంబ గారి వలే కూర్చుని "ఆధ్యాత్మిక రామాయణం", ఒక "జావళి" నర్తించి చూపారు.  ప్రబంధ నర్తన రీతిలో "భామా యని నన్ను పిలతురే" అని భామాకలాపం మాదిరి చేసి చూపారు వారి శిష్యురాలు. 
తరువాత "పేరిణీ కుమార్"  గారు "తాండవ రీతి" లో  నర్తనం గురించి వివరించారు.  చెప్పారనటం కంటే చేయించి చూపారు.  శరీరం అంతా రోమంఛితమై ఒక లాటి సుసుప్తావస్తకి గురియింది. తాళ, లయ, గతులు ఒకటై చూడముచ్చటగా నాట్యాన్ని శిష్యుల చేత చేయించారు.
"పేరిణి" అంటే సృష్టి అని అర్థం. "నాయుడుపేట నాయుడమ్మ" గారు "ఫేరిణీ" నాట్యాన్ని పైకి తెచ్చారని విన్నాము. ఆయనే నటరాజ రామకృష్ణ గారికి గురువు గారినీ చెప్పారు. "జాయప సేనాని" వ్రాసిన పుస్తకం లో - 1) లాస్య తాండవ అనీ 2) తాండవ లాస్య మనీ చెప్పబడింది, స్త్రీలు - పురుషులు చేసే పద్ధతిని వివరిస్తూ.
పేరిణీ పంచంగాలు - భరత నాట్యం లో మూలంగా కనిపిస్తాయన్నారు. కాకతీయులు తరవాత మరుగునపడింది.  పురుష సాంప్రదాయం - పేరిణీ నృత్యం.  చాలా విన్యాసాలు గురించి వివరించారు - 1) సమైక్య విన్యాసాలు 2) ఢమరకైక విన్యాసాలు 3) పిపీలకైక విన్యాసాలు.   వీటిని తాళంలో, మృదంగంలో వినిపించారు. 
తాతరి తాం....
తా తరి తధణ తోం...
వంటి పల్లవి జతులు, శిల్ప భంగిమలు, విలంబ గతి నుంచి విస్త్రుతంగా.....ఉండేవి చూపించారు. కైవార గీతాలు 4 గంటల పాటు ప్రదర్శనా క్రమం లో తీర్చిదిద్దినట్లు చెప్పారు.  పంచ భూత నర్తనం తో ముగించారు. "వికటం" చేసి ప్రేక్షకులను నవ్వించేవారు.  "విషమం" చేసి ఆకాశచారి సంచారి చేయటం ఇంక చేస్తూనే ఉన్నారని చెప్పారు.
కడప లో ఒకసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు విశ్వనాథ వారు దండం పెటారనీ  - ఆంధ్ర నాట్యం - పేరిణీ లోని పదాభినయం చూసీ మురిసిపోయారనీ చెప్పారు. 
వేసవి లో నేల లి తరువాత తొలకరిలో చిగురించి వికశించి నట్లు ఉండే విన్యాసం  - " తక్కు దిక్కు".... చేసి, వినిపించి కనులపండువగా చూపారు.  ఇది శివునికి శరీరాన్ని సమర్పించే భక్తుని ప్రేరణగా తీసుకుని కూర్చటం జరిగిందని వివరించారు. "పృథ్వి లింగం నుంచి - ఆకాశ లింగం" దాకా "సమీకరణీక విన్యాసం  చివరగా చూపించారు. మిలిన నాట్యాలలాగా 3 తీర్మానాలు కాకుండా "పేరిణీ" నాట్యం లో 5 తీర్మానాలు చేస్తారని చేయించి చూపారు. 

No comments:

Post a Comment