Friday, May 10, 2019

"Kiraata Vilasam " by the students of Guru Smt A. B. Bala Kondala Rao, Kuchipudi kalaa kendram, Visakhapatnam.


Please block your date"Kiraata Vilasam " by the students of Guru Smt A. B. Bala Kondala Rao, Kuchipudi kalaa kendram, Visakhapatnam. 
Kala Ratna Smt A.B.Balakondala Rao, 
Kuchipudi Kalaa Kendram &
Prof. Anuradha principal investigator for the UGC Major Research Project. 
Presents 
"KIRATA VILASAM"™ 
WE WELCOME ALL THE ART LOVERS TO COME AND WITNESS OUR GRAND KUCHIPUDI YAKSHAGANAM ON 
DT: 29 MARCH 19, TIME 6.30.PM
VENUE: KALA BHARATHI AUDITORIUM, MADDELAPALEM, VIZAG.
CONTACT: 9885399143.



















కిరాత విలాసం
శహాజీ మహారజ్ రచన - యక్షగాం
ఆంధ్రా యూనివర్సిటి రెగిస్ట్రార్, బాలా కొండల రావు గారు, ఆముక్తమాల్యద, ఫ్రొఫ్ అనూరాధ గారు - ఆమె DST project యక్షగానం లో, పసుమర్తి కేశవ ప్రసాద్ గారు, K. V. సత్యనారాయణ గారు, "ఆదిత్య" - శివుడు.
శివ-పార్వతులు నాట్యం చేసి చేసి అలిసిపోయి, కాసేపు కూర్చుని పాచికలు ఆడదాం అనుకుంటారు.  అయితే ఊరికే ఆడితే లాభం ఏమిటి? పందెం వేసుకుందాం అంటుంది పార్వతి.  మనిద్దరమే కదా పందెం ఎందుకు అంటాడు శివుడు. కాదు పందెం లేకపోతే పేలవంగా ఉంటుంది. పందెం ఉంటే ఎవరు గెలుస్తారు అన్న ఉత్కంఠ ఉంతుంది కాబట్టి ఆడబుద్ధి వెస్తుంది, పందెం కాద్దాం అంటుంది పార్వతి. సరే ఆమెను సంతోష పెట్టాటానికి శివుడు అంగీకరిస్తాడు.

ఆడువారు ఓడిపోతే మగవారు చెప్పినట్లు వినాలి అంటాడు. సరే అంటుంది.  మరి మగవారు ఓడిపోతే ఈమిచెయ్యాలి అంటే షరతు విధిస్తుంది...రుద్రాక్షలు, చండ్రుదు, త్రిశూలం, పులిచర్మం, విబూతి ఇచేయాలి అంతుంది.  నవ్వుతూ సరే అని ఆట మొదలుపెడతారు.  
అతను ఓడిపోతాడు - ఒక్కొక్కటి గా. ఆమె కి ఎనలేని "అహం" వచ్చేస్తుంది. పందెం అమలు చేయాల్సిందే అని అన్నీ తీసీసుకుని వేసుకుని మురిసిపోతుంటే నారదుదు వస్తాడు.  శివునితో అంటాదు - "నీవు శివుడవు కదా ఇప్పుదు దేవతలు, విషువు, నీ ప్రమద గణాలు మొదలుగా గల పరివారం అంతా వస్తే వారందరికీ నీ మొఖము ఎలా చూపిస్తావు? ఎవరు నిన్ను గుర్తిస్తారు అంటాదు.  మరి మహానుభావా మీరే  ఉపాయం చెప్పండి అన గానే, గత్యంతరం ఈముంది, వెళ్ళి మంచి మాట్లాదుకుని అన్నీ తెచ్చుకొండి అంటాదు.  ఆమె పంతానికి పోయి ఇచ్చినవి మళ్ళీ తిరిగి అడుగుతారా అంతూ వాదానికి దిగుతుంది.  మాటా-మాటా పెరుగుతుంది.  విడిపోతారు. 

శివుడు కిరాతుని వేషం ధరించి భూలోకాని కేగి అక్కడ సంచరిస్తూ ఉంటాడు. 
పార్వతీ దేవీ నారదుడు వచ్హి, అమ్మ నీ భర్త మరి భూలోకంలో సంచరిస్తున్నాడు కిరాతుని వేషం వేసుకున్నాడు.  ఇక్కడ నీవు వొంటరిగా ఏమి చేస్తావు?  ఆయన గానీ అక్కదా ఏ చెంచిత నో చూసుకున్నాడనుకో...మరి నీ పరిస్థితి ఏమిటి? అని.
అప్పుడు ఆమె చింతించి సఖి ని పిలిచి శివుని జాడ వితకటానికి పంపుతుంది.  వారు శివుని కానక తిరిగి వస్తారు.
గత్యంతరం లేక, చెంచిత గా వేషం కట్టి, భూలోకానికేగుతుంది.  అన్ని చోట్లా గాలిస్తుంది.  చివరకు, నారదుని సహాయంతో శివుని కలుస్తుంది. కానీ ఆయన చెంచు వేషం లో తనను వివాహమాడమంటాదు....వలదనీ, తాను వివాహిత ననీ, శివుదు తన భర్త అనీ, ఆభరణాలు ధరిస్తాడనీ, చెబుతుంది.  శివునికి ఆమె ఎవరో తెలుస్తుంది. బాగా ఆటపట్టిస్తాడు.  ఆమె విరహం తాళలేనని వాపోతుంది, తానెంత తప్పు చేసెనో అని వగచుతుంది.
నెమ్మదిగా అప్పుడు తానే శివుడని చెబూఆడు.  ముందు నమ్మదు, తరువాత కలిసిపోతుంది.

యక్షగానం లోని -

ముందుగా - రంగ పూజ
జతి స్వరం లోని జతులతో చిన్ని పిల్లలందరూ ఒకరి వెనుక ఒకరు జతులు ప్రదర్సిస్తూ రంగప్రవేసం చేయటం ఎంతో ఆసక్తిగా అనిపించింది.
వేద పండితులు నట్టువాంగం వేస్తూ... వేద పఠనం చేయటం కూడ కూచిపూడి లోని నృత్య సాంప్రదాయం చక్కగా విదితమయింది.

శ్రీ మతి ముట్నూరి పావని గారి దర్శకత్వం లో, కలా రత్న బాలా కొండల రావు గారి నట్టువాంగం, ఆదిత్య బ్రహ్మం గారు కొన్ని, శివునిగా, కిరాతుని గా "ఆదిత్య" చాలా బాగా చేసారు.  ఆయన కలారత్నా బాలా కొండల రావు గారి ద్వితీయ తనయుడు.

"మోదమున కుండలముల రుచు లమరగా" అంటూ విఘ్నేశ్వర స్తుతి తో ప్రారంభించారు................
ఒక్క క్షణం నా మనస్సు మా గురువులు, పూజ్యులు శ్రీ మతి ఉమా రామా రావు గారి ని తలుచుకోకుండా ఉండలేకపోయాను.
ఆహార్యం చాలా బాగుంది. ప్రవేశ దరువు చాలా అందంగా ఉంది. శివ పార్వతులు, సూత్రధారుడు - చంద్ర ప్రతాపుడు, జతి పార్వతి చాల ఉధృతంగా చేసింది.  వచనం ఎంతో బాగా చెప్పారు ఇద్దరూ కూడా. 

పార్వతి చెంచిత చాలా బాగా చేసింది ఆ అమ్మాయి. శివుడు-పార్వతి ఇద్దరూ కూడా ఎంతో బాగా నృత్యం చేసారు. చెంచిత దరువులు ముగ్ధ మనొహరం గా ఉన్నాయి. ఆ వయ్యరం, ఆ నడక, ఎంతో బాగున్నై...............ఇందులో కూచిపూడి అడవులు రకరకాలుగా వాడారు శివ పార్వతులు కలిసి చెంచు వారిలా నృత్యం అత్యద్భుతం. అడవులు కొన్ని, రోజూవారీ నృత్యం లో చూడని అడవులు కూడ కనబడ్డాయి.  ఆ వంపు, వయ్యారం, మనొహరం గా ఉన్నాయి............... శివ-పార్వతులు చెంచు వారిలా చేసిన నృత్యం మాత్రం మరువరాందిగా, వర్నించలీనిది గా ఉంది.  చూసి తరించటమే.  భాష కందని భావ ప్రకటన కలిగింది.  ముఖ్యం గా వారు చేసిన సాధన అందులో మిళిత మయి చక్కగా ప్రకటితమయింది. 
,.............................................................xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx..........................................