Monday, September 17, 2018

PRANAMYA PRAAGNAM - GURU BHAGAVATULA RAMAKOTTAYYA SMRUTYARTHAM


 



భాగవతుల రామకోటయ్య గారు  1924 లో కుటుంబ శాస్త్రి దంపతులకు జన్మించినారునాట్యం చింతా వెంట్రామయ్య గారు, వేదాంతం రాఘవయ్య గారు, భాగవతుల శేష నారయణ గారు వద్ద అభ్యసించారు. పాట  సీతారమాంజనేయులు గారి వద్ద నేర్చుకుని యక్షగానాలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎన్నింటిలోనో లవుడి పాత్ర - సన్నగా నాజూకుగా ఉండేవారేమొ అందంగా చూడముచ్చట గా ఉండేదిటకలవ శాస్త్రి లాటి గయ్యాళి పాత్ర, జర్జరీ నృత్యం, అష్టపదులు, తరంగాలు, పదాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, భామా కలాపం, గొల్ల కలాపం లాటి వెన్నో స్పష్తంగా కనుపించేలా చేసేవారని రేణుకా ప్రసాద్ గారు వివరించారు.

కూచిపూడి లో రెండు సంవత్సరాలు ఉండి, తరువాత హైదరాబాదులో కూచిపూడి కళాక్షేత్రం స్థాపించారువేములవాడ మొదలగు ప్రాంతాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చేవారులవుడు పాత్రలో ఒదిగిపోయారు ఆయన నాజూకుగా, అందంగా ఉండటంతో. కలవ శాస్త్రి గా గయ్యాళి పాత్ర అయినా, జర్జరీ నృత్యం అయినా, అష్టపదులూ, తరంగాలు, పదాలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ, భామాకలాపం వంటివి స్పష్ఠం గా కనుపించేలా ప్రదర్సనలు ఉండేవిటస్వరం మీద నాట్యం చేసేవారుట, అంటే పా/మాట లేకుండా అన్నమాట. వినూత్నంగా చెక్క మీద పళ్ళెం పెట్టి చేసేవారుటప్రహ్లాద మరియు అటువంటి యక్షగానాలు నేర్పేవారుట నిజామాబాదు వంటి ప్రదేశాల్లో.
కూచిపూడి నాట్యకళ ప్రచారం, సినీ రంగం యొక్క ప్రభావానికి లోనై, చిన్న చూపు చూస్తున్న రోజుల్లో, ధనార్జన కేంద్రంగా కాకుండా ప్రచారం చేసిన మొదటి వ్యక్తి భాగవతుల రామకోటయ్య గారు అనీ, మూకోపనిషత్తు ప్రకారం - ప్రఙ్ఙ కలిగిన వాడు ప్రాఙ్ఞుడు  - ఒక వస్థువు యొక్క వివరాలు తెలుసుకుని, దానిని గురించి అవగాహన ఏర్పరచుకోవటం - ఆలోచనలలో నవ్యత, దివ్యత, భావ్యత మరియు ప్రాఙ్ఞత  చూపటం జరుగుతాయి, అటువంటి వాటికి ప్రధమంగా నాంది పలికిన వారు శ్రీ భాగవతుల రామ కొటయ్య గారు అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదని నొక్కి వక్కాణించారు శ్రీమతి సుధామాల గారు ఆయన యొక్క విషిష్ఠ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ

కార్యక్రమనికి విచ్చేసిన అతిథులు శ్రీమతులు సువర్ణలత గారూ, ప్రసన్న రాణి గారూ,  అనూరాధా జొన్నలగడ్డ గారు, పాల్గొన్న కళాకారులు డా. శేతూరాం గారిని, డా రమాదేవిగారిని, సుధామాల గారినీ, రేణుకా ప్రసాద్ గారినీ, డా కుటుంబరావు గారినీ, చలపతి శాస్త్రి గారినీ, రోహిణీ ప్రసాద్ గారినీ, సాయి మొహిత్ గారినీ, రమేష్ కుమార్ గారినీ, కీర్తనా రెడ్డి మరియు వీణా గణేష్ లనూకేసవరాం గారూఎంతో ప్రసంసించారు, సత్కరించారు

స్త్రీ-పురుష పాత్రలను స్త్రీ లతోనే వేయించేవారు ఆయన, నిజామా బాదు లో యక్షగానాలు నేర్పినప్పుడు. తన ముగ్గురు కూతుళ్ళకూ నాట్యం నేర్పించారు, కూచిపూడి ఎక్కువగా మొగవాళ్ళే చేసేవారు కాలం లో. ఆయన నిరాడంబరంగా ఉండేవానీ, విద్య నేర్పటమే పరమార్ధం గా ఉండేవారనీ, విప్లవాత్మకంగా ఉండేదనీ చెప్పారు.
దరువులు నేర్పుతూ, సంధర్భొచితం గా, జీవితంలో ఎలా నడచుకోవాలో నేర్పుతూ నాట్యాన్ని  ఒక మార్గం గా, ఒక మాధ్యమంగా తీసుకుని బోధించేవారనీ వివరించారు.  1960 లో నవ్య నాటక సమితి తో అనుబంధమేర్పడింది. తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నప్పుదు వేమరాజు నరసిం హారావు గారు, సాంస్కృ తిక కార్యక్రమం ఏర్పాటుచేసి 1958 లో కూచిపూడి నృత్య  అకాడమీ స్థాపించిన శ్రీ భాగవతుల రామ కోటయ్య గారిని ఆహ్వానించారుఅందులో "పద్మ రాగంఅనే కథ - సూర్య గ్రహణం, పద్మము లోంచి రావటంపద్మాలు అటుగా తిరగటం వంటివి ఇతివ్రుత్తంగా కా ప్రదర్శన ఇవ్వటం జరిగింది.  11-12 ప్రదర్శనలు వన పర్తి , విజయవాడ, మొదలగు చోట్ల ప్రదర్శితమైనదని వివరించారు సుధామాల గారువారి తల్లి గారు - శ్రీమతి మణిమాల గారు కూడా అందులో పాల్గొన్నారనీ, ఆనాటి హిందు లో రెవ్యు చూపించారుజోగరాజు గారు, సోమయాజులు గారు, వేదాంతం లక్ష్మీ  నారాయణ గారి శిష్యులు. డా సర్వేపల్లి రాధాక్రిష్ నన్ గారు వొచారనీ తెలిపారుఆనాటి పద్మప్రియ, శేషమ్మ, సుజాతా గార్లు ముందు చేసేవారనీ, తరువాత పద్మ, సరోజ, జయశ్రీ, మణిమాల మొదలగు వారు దానిని ప్రదర్శించేవారనీ తెలిపారు. 1983 లో తిరిగి భాగవతుల శేతూరాం గారు పద్మరాగం, గురజాడ వారి యమన రాజు కథ లాటివి ప్రదర్శించారనీ వివరించారు. ఆనాటి గవర్నర్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసారనీ చెప్పారు.

సామాజిక ఇతివ్రుత్తాలు తీసుకుని నృత్య రూపకాలు  చేసేవారు - 1960 లో పద్మరాగం, 1962 లో రైతే రాజు, లవణ రాజు కథ, నవ భారత్ లాటివి కూ ప్రదర్శించారు. 1972 లో చర్చా కార్యక్రమం - హైదరాబాదు లో జరిగిందిఅందులో మోడరేటర్ గా P S R అప్ప రావు గారు, వేదాంతం జగన్నాథ శాస్త్రి గారు, నటరాజ రామక్రిష్ణ గారుదీక్షితులు గారూ, నాగేశ్వర రావు గారు  పాల్గొన్నారు.  శ్రీ భాగవతుల రామ కోటయ్య గారు మేకప్ చేసేవారుటనగలు చేసి వాడేవారుటఆయన భామాకలాపం చేసినప్పుడు మొదటగ సురభి కేశవరాము గారు మేకప్ చేసారుట హైదరాబాదు లో.

భాగవతుల శేతూరాం గారు తండ్రి గురించి చెబుతూ తన పరిశోధనా పుస్తకం (థీసీస్) లో ని కొన్ని విశేశాలు, తను చేసిన ముఖాముఖి సమావేశాలు యథతథంగా చదివి వినిపించారు (అంటే మాట్లాడితే భావొద్వేగం కలిగి మాటలకి వేరే అర్థాలు రావటానికి అవకాశం వస్తుందని).  తెలంగాణా లోని గ్రామీణ ప్రాంతాల్లో కూచిపూడి ని తమ తండ్రి గారు, భాగవతుల రామ కొట్టయ్య గారు, ఎలా ప్రాచారం లోకి తెచ్చారో వివరిoచి ఉంది - సాక్షాల రూపంలో, ముఖాముఖి సమావేశాల రూపంలో.  1948 పోలిస్ ఆక్షన్ సమయానికే కూచిపూడి అదిలాబాదు లోనూ, భద్రాచలం లోనూ ప్రదర్శిత మయ్యేదని తెలిపారుచెన్నూరులో అక్టోబర్ 1947 లో పగటి వేషాల మాదిరి ఆడేవారని తెలిపారుఇవన్ని సత్తిరాజు సీతాపతిరావు గారు, వారి తనయుడు, రాంబాబు గారు, కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ ఆచార్య  చెపారనీ వివరించారు. ఆయన వేషం కడితే అమ్మాయిలా ఉన్నారని పొన్నగంటి శీతన్న గారు వెయ్యి రూపాయి లిస్తాను, ఆలింగనం చేస్తావా అని అడిగారుట రోజుల్లో మరి పెట్రొమొక్ష్ లైటులు పెట్టేవారు - వాటిని పార్థసారథి గారు, జగన్నాథ శాస్త్రి గారి తనయుదు వరదాచారి గారు, కూతురు వైదేహి, జక్కపల్లి కృష్ణయ్య గారు, దేవరాసు కృష్ణయ్య గారు,    దేవరాసు రాజన్న గారు మొదలగు వారు కూడా  పాల్గొనేవారుట.  - జతులు విపులంగా చెప్పేవారుట. కరీం నగర్లో, మంథని లో రెండు (1949), భద్రాచలం లో రెండు, చెన్నూరు లో రెండు, మంచీర్యాలలో నూ, కన్నేపల్లి అగ్రహారం లోనూ జస్టీస్ S. P. జగమ్మొహన రెడ్డి గారింట,  రాజిరెడ్డి గారు, వరదాచారి గారు, భాగవతుల రామకోటయ్య గారు ప్రదర్శనలిచ్చారుట.  

జూలై 1956-57 టైం నాటికి సినిమా ప్రభావం ఎక్కువై పోయి కళకు ఆదరణ తగ్గిందిభామ వేషం, జాలరీ నృత్యం, గొల్ల కలాపం, పదాలు, చేసేవారుపదాలు చేస్తున్నప్పుడు హావభావాలు చాలా బాగుండేవిగొప్ప భావన. చాలా ఆకట్టుకునేలా ఉండేవని తెలిపారుచివరగా 26th  జనవరి 1963 చెన్నూరు లో ప్రదర్శన ఇచ్చారని తెలిపారుఆయన పారితొషికం రూ ముప్పది నుంచి యాభై మాత్రమే ననీ కూ తెలిపారు.
 
ఆయన ప్రయాణం చెన్నూరు - మంచీర్యాల మధ్యన - ముందు బస్సు, కాజీపేట కి పాసింజరూ, విజయవాడకు మరో పాసింజరూ, బందరు దాకా బస్సు - అలా సాగేదని - విసుగూ విరామం లేకుండా.   చందన చర్చిత, భామాకలాపం లో హాస్యం చాలా బాగుండేదని, పళ్ళేం మీద చేసినా, గొల్ల కలాపం చేసినా, జాలారీ నృత్యం చేసినా  చూసితీరాల్సిందే ననీ చెప్పారు.  

అటు తరవాత వారి అన్న గారైన భాగవతుల కుటుంబరావు గారు మాట్లాడుతూ.......తాను నృత్యం నేర్చుకోక పోయినా..తన 16-23 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు రోజూ భోజనానంతరం చర్చలలో పాల్గొనేవారనీ, 1979 లో ఆయన పరమపదించేవరకూ అని చెప్పారు. ఆయన ఒక విశేషమైన వ్యక్తి అనీ నిపుణత్వము-వ్యక్తిత్వమూ ఉన్న కళాకారులనీసముద్రం అంత లోతుగా ఉండేవారనీ తెలిపారు. అటువంటి వారే సమాజానికి అవసరమైన వ్యక్తులుగా అవుతారు అనీ, వ్యక్తిగా ప్రాఙ్ఞుడు అని అన్నారుఆయన ఎంతో ఉదారులనీ తోటి కళాకారులకి ముందుగావచ్చిన డబ్బు పంచేసి, తరవాతనే, మిగిలితే - తీసుకునేవారనీ, నిబద్దత, స్నేహపూర్వక బంధము, అందరూ సమానం అనే దృష్టి కోణం ఉండేదనీ వివరించారుఆయన గుణం చూస్తే, శంకరాభరణం సినీమాలోని శంకరశాస్త్రి పాత్ర గురుతు వస్తుందనీ తెలిపారుతొందర తొందరగా ఆరంగేట్రం లాటిది డబ్బిచినా చేసేవారు కాదనీ చెప్పారుసంవత్సరానికి నూటపదహార్లు ఫీసు తీసుకునేవారనీ, చాడీలు చెబితె నచ్చేది కాదనీ, తోటి కళాకారులని చిన్న చూపుగా చూసినా, మాట్లాడినా  నచ్చేది కాదనీ వివరించారు

తరువాత అతిథులకీ, గురువులకీ సమ్మానం జరిగిందితదనంతరం భాగవతుల రామ కోటయ్య గారి బాణీ లోనే ప్రదర్శన జరిగింది. తెలంగాణమున కూచిపూడి  బాణిని నిలిపిన ప్రప్రథమ నాట్యాచార్యులు.  భగవంతుని కృపవల్లనో, గురువు గారి కృపవల్లనో, గొల్లకలాపం అరుణకుమారి గారు నేర్చుకుంటుంటే చూసి నేర్చుకున్నాను అన్నారు భాగవతుల శేతూరం గారుఉషారాణి గారు, ప్రసన్న రాణి గారు కూ ఆయన వద్ద నేర్చుకుని చేసిన వారే.

1.  గొల్లకలాపం లోని ప్రవే దరువు కొద్దిగా. డా రమాదేవిగారు, భాగవతుల శేతూరం గారువిఘ్నేశ్వర ప్రార్థన మరియు వాచికం.
2.  రామనాటకం లోని నృత్యాంశము - పట్టాఅభిషేక సన్నివేశం. వేదాంతం సత్యనారాయణశర్మ గారు నేర్పించారుదీనిని రోహిణీ ప్రసాద్ మరియు శ్రీ లత - రాముడు, భరతుడు క్రింద చేసారు.
3.  రమేష్ కుమార్ గారు ఆనాడు (1981) నేర్చుకున్న గణపతి కౌత్వం చేసారు - యథాథతం గా
4.  ఆధ్యాత్మ రామాయణ కీర్తనరోహిణీ ప్రసాద్ మరియు సాయిమోహిత్ - ఓం నమస్సివాయతే  ఓం నమోభవాయ
5.  వింతలు వింటివా యశోద యమ్మా నీ కుమారుడూ మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా  - కీర్తనా రెడ్డి, వీణా గణేష్
6.  తిల్లనా - తోడి రాగం - రోహిణీ ప్రసాద్ మరియు సాయిమోహిత్ - ధీం ధీం తనన దిరన ధీంత నన

ఈ నాట్య ప్రదర్శనలతో ఆనాటి కార్యక్రమం పూర్తయ్యింది


.............................................xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx........................................