Wednesday, June 20, 2018

అథ హస్తాభినయ ప్రకాశికా



అథ హస్తాభినయ ప్రకాశికా
త్యాగరాయ గాన సభా ప్రాంగణమంతా గురువు, శిష్యులు, ప్రతిశిష్యులు తో నిండి పోయి సోభాయమానంగా వెలిగిపోయింది.  గురువు గారి దగ్గర నేర్చుకున్నవే కాకుండా తమంతట తాముగా చదివి, పరిశొధించి, ఆలోచన చేసి తమకు తోచిన రీతిలో తమ భావాలను శిష్యుల ద్వారా ప్రదర్శింపజేశారు గురు శ్రీ భాగవతుల శేతూరాం గారి శిష్యురాళ్ళు - శ్రీమతులు సుధామాల, రేణుక, రోహిణీ గార్లు.  యోగా, వేదం, నిత్య పూజా విధానం, లోక ధర్మ్యం, నాట్య ధర్మ్యం, ఆయుర్వేద శాస్త్రం, సనాతన ధర్మం లోని అన్ని క్రతువులలోనూ వినియోగించే ముద్రలు, వాటి యొక్క దైనందిన జీవితంలో ని ఆవశ్యకత, హస్త రూపంలోకి మారి ఉపకరించ బడటం ఎంతో నేర్పుగా చెప్పారు.  అయితే ఒకానొక సమయంలో పక్క దారి పడుతున్నారా అనిపిస్తున్నప్పుడు, సుధామాల గారు తమ శిష్యులతో "గాయత్రీ" మంత్రం లోని ముద్రలు చేయించారు. దానినుంచే హస్తాలు వచ్చాయి అన్న విషయం విశదీకరించారు.
అథ యోగానుశాసనం అని పతంజలి యోగా మొదలవుతుంది. అంటే - - Well! I am going to tell about yoga అని చెప్పవచ్చును. భాగవతుల రామకొటయ్య గారి ని మొదటి సారిగా తమ ఇంట్లొ చూసానని అన్నారు సంస్థ కార్యదర్శి శ్రీ వేమూరి విజయ కుమార్ గారు.  వారి తండ్రి గారే "నవ్య నాటక సమితి" ని ఏర్పాటు చేసినది.  ఆయన తనయుడే ఈనాటి సభకి అధ్యక్షత వహించిన శ్రీ భాగవతుల సేతూరం గారు,  గురు సత్కారం చేస్తూ ఆయన వీరందరూ "విషయ పరిజ్ఙానం" లో దిట్టలు అని చెప్పవచ్చును అని అన్నారు.
నవ్య నాటక సమితి లో వేదాంతం ప్రహ్లాద శర్మ గారూ, వేదాంతం జగన్నాథ శర్మ గారు కూడా సభ్యులనీ చెప్పి, 5 రోజులు పోటీలు జరిగేవనీ చెబుతూ సాంఘీక నాటకాలు "ఛండాలిక", లవణ రాజు గారు ప్రదర్శించిన బహుసహ మొదటి భావ ప్రకటన "పద్మ రాగం " లాటి నృత్య నాటికలు ప్రదర్శితమయ్యేవని వివరించారు.  రామాయణ శబ్దం చేస్తూ పోటీల్లో రోజంతా ఆడి ఆడి అలిసిపోయి కాళ్ళు లాగేసి తీరా స్టేజీమీద "ఆడిన మృగమది వెంబడిపోతివి.."  చేసే సమయానికి, చెయలేక కూర్చుని చేసి వచ్చేసాను అని చెప్పి, తండ్రి గారు కోప్పడతారని అనుకుంటుంటే రెండవ బహుమతి వచ్చి, చాలా బాగా చేస్తాడు అని అనిపించుకునే స్నేహితుడికి కన్సొలేషన్ బహుమతి వచ్చిందని చెప్పి, సంతోషంగా అక్కడి నుంచి పారిపోయాడట.
సుధామాల గారు ప్రసంగిస్తూ -  వేదాలనుంచి ప్రామాణికంగా వస్తుందని. విదేశాలలోన నాట్యాలు ఎక్కువగా లోకధర్మి మాత్రమే కనిపిస్తుందనీ, భారతీయ కళలలో లోక ధర్మి, నాట్య ధర్మి కలిపి ఉంటాయనీ ఉద్దెశ్యపడ్డారు. వేదాలు ముద్రలతో చూపటం. గాయత్రి మంత్రంలో 24 ముద్రలు + 8 ముద్రల సముదాయంగా వివరించారు.
చాల రకాల ముద్రలు చేతులతో చెసేవి వేదిక కర్మలందు, మంత్రాలు పలికేటప్పుడు, వాడబడతాయి - ఉదా:  "సుముఖం" చెప్పేటప్పుడు రెండు పతాక హస్తాలని దగ్గర చేర్చి లోనికి చేసినట్లు చూపెడతాం - శరీరంలోనికి ఆవాహన చేసుకోటానికి చేస్తున్నాము అని అర్థం, అలాగే ఎన్నో రకాల వినియోగాలు ఉన్నాయి.
చేతిని చాపి మరో చేయి బొటన వ్రేలు మధ్యన ఉంచాలి.  విధంగా రెండు చేతులతో చేసి, వ్రేళ్ళు  తగిలించి ఉంచాలి.  తరువాత, రెండు పతాక హస్తాలను ఒక దాని ముందు మరొకటి పెట్టి తిప్పినట్లయితే వేడి పుడుతుంది. దీనినే "Aura" అంటే - "energy field" అని అంటారు.
purification of water కి కూద ముద్ర ఉంటుం దని అన్నారు ఆమె. నృత్త హస్తాలు - నాట్య శాస్త్రం లో  30; అభినయదర్పణం లో 13; భరతర్నవం లో 20 ఉన్నాయనీ, అవన్నీ కరణాలలో ఉపయొగపడతాయనీ చెప్పారు. శివుడు సంధ్యా సమయంలో తను చేసే నాట్యాన్ని పెట్టమని "తండు" నికి చెప్పా డు కావున "తాండవం" అనే పేరు వచ్చిందని అన్నారు.  ఈశ్వరుని ప్రీతి పాత్రుడై   ఉన్నవానికి మాత్రమే శివుని కరణాలు నేర్చుకోగలుగుతారని చెప్పా రు.  PSR appa rao గారివి 25 పుస్తకాలు.  "నారదీయ శిక్ష" అన్న పుస్తకం క్షే త్రయ్య నాట్య శాస్త్రానికన్నా ముందుది - సప్త స్వరాలకి కూడ ముద్రలున్నాయని అన్నారు - ఉదా:  గుర్రపు శబ్దం. కాలమానం గురించి, ఋతువుల గురించి చెబుతూ - ఉదా: సందంస హస్తం వర్షానికీ, సర్పశీర్ష హస్తం క్షీర సముద్రం గురించి  వాడతారని వివరించారు.  చివరగా వారి శిష్యురాలు మేఖల -  "నిన్ను చూసి నాలుగైదు నెలలాయె మువ్వ గోపాలా" అనే క్షేత్రయ్య పదాన్ని చక్కగా అభినయించారు.      
రేణుక గారు మాట్లాడుతూ ముద్ర అన్నది మనస్సుకి మరియు బైటి ప్రపంచానికీ ఒక వారధి.  భావ వ్యక్తీకరణకి వీలయినది.
Palm is the index of sub-conscious mind.
Fingers are the index of conscious mind.
జప-తప-మంత్రాది నిత్య పూజలలో ముద్రలు వాడటం జరుగుతుంది.  మన ఇదు వ్రేళ్ళు కూడా పంచ భూతాలని గుర్తుగా సూచించుతాయని, ఆయుర్వేద శాస్త్రం లో ఒక్కక్క వేలుకీ ఒక్కొక్క ఆరోగ్య సూత్రం  ఉందని వివరించారు. Pranik healing, Reiki healing వాటిలో కూద ముద్రలు ఉపయోగపడతాయని చెప్పారు. భావ సూచికలు, దేవతా సూచికలూ, ఋషి ప్రోక్తాల్లో కానీ, కలశ పూజలో కాని, ఆవాహన, సాక్షి ముద్రలోనూ, సానిధ్య ముద్రలోనూ, దేవతల నుంచి వచ్చినదే.  నైవేధ ముద్ర, జపం చేసేటప్పుడు కూడా హస్తాలు ముద్రలు ఉన్నాయి.  ఉత్తమ అభినయం లో తక్కువ, మధ్యమం లో మధ్యస్తంగా, అథమంలో ఎక్కువ అభినయం ఉంటుంది.
నవ రత్నాలకీ, రాసులకీ, ముద్రలు ఉన్నాయని చెప్పా రు.  తమ శిష్యురాళ్ళతో "ఇన్నిరాసుల ఉనికి", "తిరు వీధుల తిరిగేను" చేయించారు.  వేదాంతం జగన్నాథ శర్మ గారిని ఒకసారి మైసూరు మహారాజు గారి ఆస్థానంలో 1-10 అంకెలకి వేదాంతార్థము, నాట్యార్థము కుడా  అప్పటికప్పుడు చెప్పమన్నారుట.  అంకెలకి కూడా  హస్తాలు ఉంటాయని వివరించారు.
రోహిణి గారు మాట్లాడుతూ... శాస్ట్రం మరియు సంప్రదాయం.  శాస్ట్రం నిర్దేసించటం వ్యాకరణాది గ్రంథాల ద్వారా. సాంప్రదాయాన్ని శాసించితే వచ్చేది అమరకోసం ద్వారా, అది గురువుని ఆశ్రయించి నేర్చుకోవాలి.
అథ అనగా - మంగళ వాచకం.
హస్తాభినయం - హస్తములను ఉపయోగించి చేసే నర్తనం
ప్రకాశికా - ప్రకాశింపచేసేది.  "భం" అనే పదం భారతీయులు ఇష్ట పడతారు.
అభినయం - అభిముఖంగా - (taking forward). అంటే ఒక కథ ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చటం.  దానికి వారధి లా వ్యవహరించటం.  అదొక చేష్టా విశేషం.
శాఖాభినయము - అంటే మన శరీరానికి చేతులు, కాళ్ళు లాటివన్నీ చెట్టునకు శాఖలు ఎట్లాగో అలా అన్నమా ట.  శాఖ అనగా విచిత్రమైన.....వాటి కదలికలే - ప్రధాన కదలికలు. 
హస్తాభినయం - శౌష్ఠవము ఉండాలి, posture ఎలా ఉండాలి అంటే - చతురస్రం లో ఉండాలి.  భరత నాట్యం లో, కూచిపుడి లో,  సాత్రియ లో, కథక్ లో, విలాసిని లో posture ఎలా ఉంటుందో చేసి చూపించారు.
శిల్ప, నాట్య, వైదిక కర్మలలో కూడా ముద్రలు ఉపయోగపడతాయి.  వైదిక ముద్రలు,  కాంతిక ముద్రలు, జపాలు, దేవతా ఆవాహనం, తాంత్రిక ముద్రలు, లౌకిక ముద్రలు ఉంటాయని వివరించారు.
ముద్రలు - దేవతలకి సంతోషం కలిగించేది. మోదకం, ద్రావణం, attraction, negative గా చేసేది.  త్రికరణ శుద్ధిగా జరిగే పూజ, కర్మ ముద్రల ద్వారా కలుగుతుంది.  Result:  అంతర్గతి అంతే internalizing.  అంగవిక్షేపం - static నుంచి moving వైపు వెడుతుంది అంతే మోహం కలుగుతుంది.  ఇది external result.  ముద్రలు పట్టటం అంటే రాసోత్పత్తికి తోడ్పడటం.  అభినయానికి ముద్రలు ఉపయోగం హస్తాలుగా తీర్చిదిద్దుకుంటాయి. 
నాట్యానికి ప్రమాణాలు మూడు - లోకము, వేదము, ఆధ్యాత్మ్యం.  వీటికి authentication - లోకము అంటే సూర్యచంద్రులు ప్రమాణం.  వేదాలకి శాస్త్రం అంటే ఇక్కడ నాట్య శాస్ట్రం ప్రమాణం.  తనకు తానుగా తెలుసుకున్న విషయమే ప్రామాణం - ఆధ్యాత్మ్యం.  వారి గురువులు శ్రీ భాగవతుల సేతూరాం గారు - దేక్షితార్ కృతి కి రూపకల్పన చేసారు.  ఆయనకి తెలుసో తెలియదో తెలియదు కాని - పైన చెప్పిన మూడు ప్రమాణాలూ అందులో నిక్షిప్తమైనాయి.  వరద అభయ హస్తము - "కంజ దళాయ తాక్షి" లో శాస్త్ర వినియోగం.  రస-భావ-చేష్టలకి - "మామవ శివ పంజర స్తుతి" లోకము.  రత్న సిం హాసనం - శిఖర కాకుండా అర్థచంద్ర ఉపయోగించారు - ఆధ్యాత్మ్యం.
భామాకలాపంలో - హస్తాలు విరుధం గా ఉపయోగించటం జరుగుతుందీని చేసి చూపించారు.  అంటే అందులో "మాధవి" పాత్ర పండటానికి - దక్షిణ భారతం, సంగీతరత్నాకరం, సొమేస్వర పురాణం, బాల రామభరతం లో హస్తాలు స్త్రీ లింగ, పుం లింగ, నపున్సక లింగాలుగా విభజింపటమైనదని చెప్పరు. "తల పాకములు" అన్నవి హస్తాలు వాడినా  లేకపోయినా - భావాన్ని ప్రక టించేవిగా హస్తాలు చేస్తారు అని ముగించారు.

No comments:

Post a Comment