ఒకానొకప్పుడు గురువు శిష్యులు ఒకరికోసం ఒకరు తపించేవారు. ఇది కలికాలం కదూ.................... ఆ తరం గురువులు కూడ కలి బారిన పడ్డారు. కాసులు, కోరికలూ వదలటం లేదు. ఎంత దండుకుందామా అని మాత్రం చూస్తున్నారు. ఎంతిచ్చినా తీరటం లేదు. చేతి దురద............. ఎంతసేపూ తన కోసం చూడటమే కానీ ఇచ్చిన కాసుకి తగినంత విద్య చెప్పామా అన్న కనీస, ఆ చిన్న ఆలోచన, కూడా చేయటం లేదు. ఎంతసేపూ శిష్యులని తిట్టటమే కానీ ఒక వేలు తమని కూడ చూపుతున్నది అని చూసుకోరేం. తెలిసే చేస్తుంటే శిష్యులు ఎవరిదారిని వారు వేరే దారి వెతుక్కుంటూ వెడుతున్నారు. నిజమైన శిష్యులు తమంతట తాముగా గురువు ఇది నువ్వు చెయ్యి, ఇది ఈ శిష్యురాలు లేదా శిష్యుడు చేస్తారు అని అంటారేమో నని ఎదురుచూస్తున్నారు. కానీ ఎందుకు ఈ గురువులు అనటం లేదు? అనలేకపోతున్నారు? గురువుని మించిన శిష్యులు అంటే పాత తరం గురువులు పొంగిపోయేవారుట!!! ఈ తరం లోని పాతవారూ అలా కనిపించటం లేదు. ఏ శిష్యులు ఎక్కువ కాసులిస్తే వారికే విద్యని నేర్పుతున్నారు. కాసులిచ్చినా, గురువే తమకి తనంతట తానుగా, తమకున్న విజ్ఞానం చూసి, తమకున్న ఆసక్తి చూసి, అడక్కుండా తాముఏది నేర్చుకోవాలో వారే నిర్ణయిస్తారేమో అనే వారికి ఈయటం లేదు. అడగందే అమ్మైనా అన్నంపెట్టదన్న సామెత నాధారంగా ఉన్నారు. ఇది ఈతరం మాదిరి ప్రవర్తన కానీ, పూర్వం చెప్పినట్లుగా గురు-శిష్య పరంపర కాదేమో అని గాఢంగా అనిపిస్తొంది. కాసు కున్న విలువ విద్యకి లేదు. సమాయానికంతకన్నా లేదు. పడిగాపులు గాచినా విద్య మాత్రం దక్కదు. చివరికి కాసులూ పోయి, సమయమూ వృధా అయి, విద్యాలేకుండా, సమాజంలో సంపాదించుకున్న ఆ కాస్త మర్యాదా పోయి, పరపతి పోయి, ఒట్టి చేతులతో, అవమాన భారం నెత్తినేసుకుని, చక్కాపోవటమే జరుగుతోంది. వేరే విద్యలనాశ్రయించి బ్రతుకు తెరువు చూసులోవలసి వస్తోంది. జ్ఞాన సంపద ఒకచోట, కాసుకోసం పని మరోచోట చేసి అలిసి సొలసి పోవటం, ఈ రాజకీయ వాతావరణం మారక పోవటం, అలా ఉంటేనే విద్యార్జన సానుకూల పడటం జరుగుతోంది. అందుకే ఏ రంగంలోనూ విద్యార్హతలు, జ్ఞాన సంపద కలవాళ్ళూ కరువయ్యారు. అంతటా, కాసుల గలగలలు, రాజకీయత, లోపాయికారీతనంతో విద్యను సంపాదించిన శిష్యుల రెపరెపలు తప్ప, జ్ఞాన సముపార్జన కోసం, వచ్చే శిష్యులు నిలువ లేక వెడలి పోవటమే జరుగుతోంది. నోరుతెరిచి అడగని శిష్యులకి మిగిలేది విద్య నేర్పక పోవటం, కాసులు పోవటం, సమయం వృధా అవటం, రాసిన పరీక్ష లో మార్కులు ప్రదర్శించిన విద్యకి కాకుండా వారి మీద గురువు ఏర్పరచు కున్న దురభిప్రాయం మూలంగా వచ్చిన మార్కులు, వ్యధ, బాధ. నిజమైన శిష్యులకి తమ లోని విద్య తమకే తెలియదుట, అందుకే గురువు తానే చెప్పాలిట. తరవాత, వినయంగా ఉండి, మన కోసం మనమే అడగ కూడదు అనుకునే సున్నిత హృదయం శిష్యునికి ఉండాలిట. మరి ఈ లక్షణం పూర్వకాలం లోని గురు-శిష్యులకి మాత్రమే వర్తిసుందేమో!! ఈ నాటి గురువులకి మాత్రం కాదు, నిక్కచ్చిగా!! ఈ నాటి పాత తరం గురువులకి కూడా కాదు...నిక్కచ్చిగా!!
అమ్మ కథలు నా మ్యూసింగ్స్ Dance workshops, knowledge sharing stories general knowledge on science life experience in general
Wednesday, February 23, 2011
గురు-శిష్య పరంపర

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment