Wednesday, January 26, 2011

ఓ బున్ని సరదా కథ

ఇది పెద్ద కథ తరవాత "బోనస్" కథ అన్నమాట.
ఆనంద్ నగర్ కాలనీ లో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. వారి పేర్లు ఉల్లిపాయ, ఐస్ క్రీమ్, టొమాటో అన్నమాట. ఓ రోజు అందరూ ఆడుకుంటుంటే ఎవరో టొమాటో ని తొక్కేసారు. పాపం టొమాటో చనిపోయింది. ఉల్లిపాయ, ఐస్ క్రీమ్ "అయ్యో మన ఫ్రెండ్ ఇక లేడు, అయినా వాడికి కనీసం మనిద్దరం ఉన్నాము ఏడవటానికి, బాధపడటానికి - వాడు అదృష్టవంతుడు రా" అని అనుకున్నాయి.
కొన్నాళ్ళు గడిచాక ఇద్దరూ కలిసి "స్విమ్మింగ్" కి వెడదాము, ఎండ విపరీతంగా ఉంటోంది" అని అనుకున్నారు, వెంటనే వెళ్ళిపోయారు, నీళ్ళలో ఆడుకుందుకు. కానీ వాళ్ళ దురదృష్టం ఐస్ క్రీమ్ నీళ్ళల్లో కరిగిపోయింది.
దాంతో ఆ బాధ భరించ లేక "అయ్యో!!! టోమాటో గాడూ పోయాడు, నువ్వూ పోయావా, అయినా నువ్వూ అదృష్ట వంతుడివే, కనీసం నేనున్నాను నీకేడవ టానికి అంటూ"......................... తనే ఒంటరి వాడని, ఏడిచ్ందిట. అందుకే పిల్లలూ, ఉల్లిపాయని కోయగానే అందరికీ ఏడుపువస్తుంది.................. దాని కోసం అందరూ ఏడుస్తారన్నమాట. (మీకు తెలుసా!!! ఉల్లిపాయలు కోసినప్పుడు, కళ్ళల్లో నీరు వస్తాయి....బాగా మండుతాయి.....)


.....................................................................................................................................మీ స్వర్ణత్త

No comments:

Post a Comment