Thursday, January 20, 2011

సైన్స్ లో ఉన్నత విద్య - ఉద్యోగాలు - మహిళలు

మన దేశం లోనే కాక ఈ ప్రపంచం మొత్తానికి కూడ మహిళలు సైన్సులో చేసే ఉన్నత విద్య, అధ్యయనం, ఆ తరువాత ఉద్యోగ నిర్వహణ ఒకే మాదిరిగా ఉన్నాయి. ఈ పురుషాధిక్యత సమాజంలో, కాలం మారుతున్నప్పటికీ, "మహిళా _ రచయిత్రులు" _ ఎంతో - కొంత తక్కువగా అంచనా వేయటం జరిగిందనీ, అన్యాయం జరిగిందనీ", "మహిళా వాదులు" చెలరేగుతూ ఉంటారు. పత్రికల్లోనూ, మీడియాలోనూ కూడ వీరి గొంతు కొంతవరకూ వినిపిస్తూనే ఉంటుంది. కానీ ఈ సైన్సులో ఉన్న మహిళ గురించి ఎవరూ అంతగా పటించుకోరు. ఏవొ కొన్ని విశ్లేషణలు ఉన్నా, తక్కువే. సామాన్యంగా మహిళ అనగానే - చేతి పనులు, వంటావార్పూ, కళలు లాటివి మాత్రమే అనుకుంటారు. ఈ నాటికీ పెరిగిన ఇంతటి విజ్ఞానం వెనుకా సైన్సు చదివే మహిళలు తక్కువే.
సహజంగా స్త్రీ సహనశీలి, నెమ్మదిగా ఉండి సమస్యని అన్ని కోణాలా ఆలోచన చేసి అడుగేస్తుంది. అలాగని అటువంటి మగవారు లేరని కాదు. ఇది అన్ని రంగాల, అన్ని వర్గాల వారికీ వర్తిస్తుంది. ఒక్క సైన్సు వారికే కాదు. మగవారితో పోలిస్తే, ఆమె రెండు-మూడు రెట్లు ఎక్కువ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ కష్టపడాల్సి వస్తుంది. ఎందుకంటే వంటావార్పూ, పిల్లలూ-ఇల్లూ, భర్త చుట్టాలు లాటి వాటీతోపాటు, చదువునూ, ఉద్యోగాన్ని కూడ నిర్వహిస్తుంది కాబట్టి. కొంతమంది లలిత కళలు కూడ నిర్వహిస్తూ ఉంటారు. పిల్లలూ, సంసారం ఉన్న ఆడవారికి ఓ పదేళ్ళ కాలం గడ్డుగా గడుస్తుంది. చాలా మందికి భర్తలు, తల్లిదంద్రులు అత్తమామలు కూడా సాయం చేస్తూ ఉంటారు. అయితే అడంకులన్నీ నిలదొక్కుకుని మహిళలు ఈనాడు తమ "కెరీర్" లను కొనసాగిస్తున్నారు. ఈ తరం లోనూ, వెనుకటి తరాల్లోనూ కూడా ఎందరో మహిళలు ఉన్నారు. అంటే వీరు మామూలుగా పెళ్ళి_పిల్లలూ లాటివి సరి అయిన సమయానికే చేస్తూ, వారి వారి "కెరీర్" ని అందరు మగవారితో సమానంగానే, ఎటువంటి సమయాభావం లేకుండా, సైన్సు ప్రయాణాన్ని సాగిస్తున్న వారి ముచ్చటలు అన్నమాట!! పిల్లల్ని కనటం, పెళ్ళాడటం ప్రతిబంధకాలుగా అనుకోకుండా, అది మగవారికి మల్లే, మాకూ చాలా సహజమే అనుకున్న వారి గురించి!! చెప్పుకుంటున్న విషయాలివి.

ఉన్నత విద్యలో సీటు కోసం మగవారితో సమానంగానే చదివి సీటు సంపాదిస్తారు కదా!! ఇక్కడ "ఆర్ట్స్_కామర్స్" లాటి వాటి కన్నా, సైన్సు లో పోటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మహిళలకి మరీ ఎక్కువే కష్టం. మగవారితో కలిసి పని చేస్తుంది. అయితే వీరి చేతే చాకిరీ చేయిస్తారు. పైఆఫీసర్లుగా మగవారుండి "ఆర్దర్"లు వేస్తుంటే సహనంతో, ఓపిగ్గా, ఎంతో సమర్ఢవంతంగా, క్రమ పద్ధతిలో చేస్తుంది. ఆడ పిల్లలతో పని చేయించేసుకుని, వీళ్ళేల్లాగూ పెళ్ళిళ్ళు చేసుకుని వెళ్ళిపోతారుగా అంటూ, సుపర్ వైజర్లు, గైడ్లు, ఆఫీసర్లు, దానిని వాళ్ళ సొంత పనిగా చెలామణీ చేసేస్తారు. అందుకే చాలా సంస్థలలో మహిళలతో తక్కువ జీతాలకి, ఎక్కువ పని చేయించుకుని, పదవులు పెంచేసుకుని, ఏసీ రూముల్లోకి ఎదిగి పోతూఉంటారు. చిత్రంగా వీరి జీతం మాత్రం పెరగదు. పెంచే సమయం వచ్చేసరికి కుంటి సాకులు చెబుతారు. "సాయంత్రం ఆఫీసు టైమ్ అవగానే వెళ్ళిపోతావనీ, ఓ ౫-౬ రోజుల్లో ఎక్కువ సెలవు తీసుకున్నావనీ, ఆఫీసులోని అందరితో కలివిడిగా మాట్లాడావు కాబట్టి వారికి నీ మీద గౌరవం లేదనీ, సగం పని చేసాక వేరే మగవారి చేత పని పూర్తి చేయించేసి, నీవేం చేసావనీ, అతనే కదా పూర్తి చేసాడనీ" లాటివి చెబుతారు.
అలాగని లేరని కాదు కానీ, కొంతశాతం మహిళలు మాత్రమే ఎక్కువ జీతాలకి పని చేస్తూ కనిపిస్తారు. అయితే అందులో అధికశాతం మంది పెండ్లి కాని వారో, లేదా పెళ్ళిళ్ళు చెడిన వారో, లేదా వివాహేతర సంబంధాలు ఉన్న వారో లేదా ఇష్టపూర్వకంగానే సహజీవనం చేసేవారో, లేదా ఇంటిదగ్గర చూసుకునేవారుండి పూర్తి సమయాన్ని ఆఫీసుకే అంకితం ఇచ్చేసేవారో ఉంటారు. ఇవేవీ లేకుండా సాదాసీదాగా ఉండే గృహిణులు (ఇల్లు దిద్దుకుంటూ ఉద్యోగం చేద్దామనుకునేవారు) తప్పకుండా " డోర్ మాట్" గా, అంటే కాలికింది పట్టాలా, వాడకంలో ఉన్నారనటంలో అతిశయోక్తి లేదు. వాడేసుకుని ఓ తన్ను తన్ని మరీ విసిరి పారేస్తున్నారనటం లోనూ అతిశయోక్తి లేదు. బాగా చదువుకున్న వారిని ఉద్యోగాలు చేయకుండా, పై పదవులు రాకుండా తొక్కేసి తమ కింద "అసోసియేట్" లా ఉంచేసుకుని పనిచేయించు కోవటం పరిపాటి అయిపోయింది.

ముఖ్ఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో రిసర్చీలో ఈ ధోరణి చాలా ఎక్కువ. ఆడవాళ్ళు లాబ్ లో పని చేసి వెళ్ళిపోగానే, తోటి మగవారు ఆ పని వారే చేసి నట్లు, కొట్టేసి, ప్రచురించేసుకోవటం చాలా మామూలే. మన దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఇదే పరిస్థితి. పేపర్లో పెట్టక పోవటం కానీ, అస్సలు ఆ పని ప్రచురణ కాకుండానే ఆపేయటం కానీ జరిగిపోతూనే ఉంటాయి. ఎంత సమానార్హతలు ఉన్నాకానీ హెచ్చుస్ఠాయి ఉద్యోగాలు కానీ, యూనివర్సిటీల్లో ఉద్యోగాలు కానీ ఇవ్వరు. వాళ్ళ పెళ్ళి, పిల్లలూ సాకుగా చూపిస్తారు. అంతవరకూ కూడ వాళ్ళు సంసారులు గానే ఉండి ఈ పనులన్నీ చేసారు కదా అని ఆలోచించరు. అందుకని "నోన్ డెవిల్ ఈస్ బ్ ట్టర్ దాన్ అన్ నోన్" అనుకుని వాళ్ళ పీహెచ్ డి మ్ంటర్ దగ్గరే సంవత్సరాల తరబడి పడి ఉండటం జరిగిపోతోంది, ఎదుగూ బొదుగూ లేకుండా!! సొంత ప్రతిభ ఉన్న వారిని నిస్సందేహంగా తొక్కేస్తారు. "పైరర్ సెక్స్" అనో, లేదా మరేదైనా అలాటి ఛీప్ ట్రిక్ లతో, వారు వ్రాసిన ప్రాజ్ క్ట్ లను శాంక్షన్ కానీయరు. వాళ్ళ కళ్ళే దుటే వాటిని చేసేసి, ఆహ్వానించి మరీ చూపిస్తారు. ఓ వంకర నవ్వు నవ్వేస్తారు, వీరి నిస్సహాయత చూసి.

ఇవన్నీ ఒకరిద్దరికి జరిగిన సంఘటనలు కావు. ఒకటి, రెండు యూనివర్సిటీల్లోనూ, సంస్ఠల్లోనూ కూడా కాదు. అంతటా ఇదే పరిస్థితి. పొనీ అలాఅని నీ నొక్కదాన్నీ అనటం లేదు. ఎందరినో అడిగాను. వాళ్ళూ ఇదే అంటున్నారు. చుట్టూ తా ఉన్న మగ కలీగ్స్ వాళ్ళకి రకరకాలుగా మంచిగా, సాయం చేస్తున్నట్లుగా నటిస్తూ, ఎలాగోలా వారి పనిని లాగేసుకుంటున్నారు. వీరికంటే ముందే, రాత్రిళ్ళు ఎక్కువ సేపు ఉన్నట్లు నటించి, (వీళ్ళేళ్ళ గానే ఓ అరగంటకి వెళ్ళిపోతారు), ఇంకేదో కాస్త ముక్క మిగిలితే ఆ కాస్తా చేసి, (అది కూడా వీళ్ళు వెళ్ళే ముందే మాట్లాడేసు కున్నదే!!), దాన్ని మొత్తం తమ చేత్తో పూర్తిగా మళ్ళి రాసేసి, వారి సొంత ప్రతిభగా ప్రకటించేసుకుంటారు. అదేదో సినిమాలో నాగార్జున లాగా నన్న మాట!!! అదే నండి "రెవెలోన్ ఆడ్" హీరోయిన్ చేస్ స్తుంది??? గురుతొచ్చిందా!!! అదీ!!! మిత భాషులో, లేదా లైక్యం, లేనివారో, లేదా అమాయకులో, ఎదుటివారిని పూర్తిగా నమ్మేవారో, అసలు తమ లోని ప్రతిభసు తామే ఎలా చెబుతాం, ఎదుటివారు గ్రహించాలి కానీ" అని అమాయకంగా ఎదురు చూసేవారో ఇలాటి వాటివారి బారిన పడి తోక్క బడతారు. ఇలాటి వాటికి చక్కని ఉదాహరణ - "రొసలిన్డ్ రాన్క్ లిన్". ఆమె (డ్ యన్ ఏ) యొక్క ఆక్రుతి ని అంటే ’స్త్రక్ చర్’ కనుగొన్నారు. కానీ ఆమె సహ ఉద్యోగి ఆ పనిని తస్కరించి, తనది గా ప్రచురించేయటం, "నోబెల్" బహుమతి గ్రహించేయటం కూడ జరిగిపోయింది. అది ఆమే చేసింది అని తెలిసే సరికి చాలా ఆలస్యం అయిపోయింది. ఆమె పిన్న వయస్సు లోనే ఏదో కారణంతో గతించటం జరిగి "నోబెల్ కమిటీ" వాళ్ళు తప్పు దిద్దుకో లేక పోయారు. "నోబెల్" బహుమతులు బ్రతికి ఉన్నవారికే ఇస్తారు.

తమ మీద తమకి విశ్వాసం ఉండి, తాము చేసినది చేసినట్లు నిరూపించుకుని, తక్కువ మట్లాడి, డబ్బిస్తే కానీ మాట్లాడ కుండా, డబ్బిచ్చినా సానుకూల పరిస్టితులు లేకపోతే చేయకుండా, అవకాశం కోసం పులిలా వేచియుండే మహిళలు చాలా తక్కువ శాతం. అలా మగవారు ఉండవచ్చును కానీ మహిళలు ఉంటే "పొగరుబోతు" అని పేరు పెడతారు.
చదువు, పనిలో నేర్పరితనమూ, వేరే సబ్జ్ క్త్ లో ఉండి, మగవాడు అయి, కరుకుగా మాట్లాడ గలిగితే, ఎంతో సేనియర్ అయినా, మరో సబ్ జెక్త్ లో దిట్ట అయినా మహిళ చేత మాత్రం సగానికి సగం జీతానికి అతని క్రింద పనిమనిషి గా మార్చేస్తారు. ఆమె చేసే ప్రతీ పనీ ఆ వ్యక్తి తను చేసి నట్లు చూపిస్తుంటే నిస్సహాయంగా చూస్తూ ఉండటం తప్ప ఆమె ఏమీ చేయలేదు. కారణం అతని కరుకుతనం, ఆటలాడే నైజం, తొక్కిపడేసే గుణం. పై అధికారిగా ఉంటూ, ఆమె చెప్పిన దేదీ కూడ సరికాదని వంకర చూపులతో, నవ్వులతో అందరూ కలిసి అనేసి, ఏనాటికీ ఆమెకి "ఎదుగుదల" అంటూ అస్సలు ఉండకుండా చేసేస్తారు. ఒకే జీతానికి సంవత్సరాల తరబడి వారి యొక్క సంస్థని రకరకాల రంగాల్లో అభివ్రుద్ధి చేసేలా చేస్తారు. ప్రతీ పనినీ సగంలో వేరే వారికి అప్పజేప్పేలా చేసిమరీ!! జరుగుతున్నది తెలిసీ నిస్సహాయురాళ్ళుగా ఏళ్ళ తరబడి అలా తొక్కేయబడతారు, ఆ వచ్హే నాలుగు రాళ్ళ అవసరం కొద్దీ. సంస్థలు మారినా, మగ మస్థత్వాలు మారవుగా!!! పరిస్థితిలో ఎటువంటి మార్పూ ఉండదు. ఆమె ఆ పరిస్థితిని మార్చే ఓపిక లేక, తిరగబడే నైజం లేక, ఎలా చేప్పాలో తెలీక, "తెలిసి చేసే వారికేం చెప్పాలి" అనుకుని "అర్ధంచేసుకోకపోతారా, తెలుసుకోకపోతారా!! ఓ నాటికైనా" అని అనుకుంటూ...........

"ఉపకారికి నుపకారము విపరీతము
కాదు సేయ వివరింపంగా!!
అపకారికి నుపకారము నెపమెన్నక
సేయువాడు నేర్పరి సుమతీ!!

అన్న సుమతీ శతకం లోని పద్యాన్ని ఆదర్శంగా తీసుకుని "ఆడువారి సైన్స్ ప్రయాణం" సాఫీగా, సంతోషంగా సాగాలని ఆశిస్తూ.......................

ఈ సింహావలోకనం...................
------------------------------------------------------------------------------------
గమనిక:.........."మహిళాబిల్లు" శాసన సభలో ఆమోదించబడిన శుభసమయంలో......... వారి జీవితాలు, కనీసం యువ వనితా శాస్త్రవేత్తలకు, మున్ముందు చక్కని దిశ-దశ దొరుకుతాయని ఆశిస్తూ..........................
------------------------------------------------------------------------------------

Reference that is published after the writer has composed this article, during the years 2009-2010 taking opinion of several woman colleagues during her PG teaching.
1 “The HINDU” - “Women scientists face systemic biases”, Divya Gandhi, Bangalore, 7th May 2010.
2 http://www.ias.ac.in/womeninscience/index.htm "Trained Scientific Women Power: How Much are we Losing and Why?" - The report of the study conducted by WiS Panel of Indian Academy of Sciences is released! – Women in Science – A Indian Academy Initiavite.


………Thank you for reading. You may give your own opinions.
Dr. G. Swarnabala

No comments:

Post a Comment