Monday, September 17, 2018

PRANAMYA PRAAGNAM - GURU BHAGAVATULA RAMAKOTTAYYA SMRUTYARTHAM


 



భాగవతుల రామకోటయ్య గారు  1924 లో కుటుంబ శాస్త్రి దంపతులకు జన్మించినారు.  నాట్యం చింతా వెంకట్రామయ్య గారు, వేదాంతం రాఘవయ్య గారు, భాగవతుల శేష నారయణ గారు వద్ద అభ్యసించారు. పాట  సీతారమాంజనేయులు గారి వద్ద నేర్చుకుని యక్షగానాలు ప్రదర్శనలు ఇచ్చేవారు. ఎన్నింటిలోనో లవుడి పాత్ర - సన్నగా నాజూకుగా ఉండేవారేమొ అందంగా చూడముచ్చట గా ఉండేదిట.  కలవ శాస్త్రి లాటి గయ్యాళి పాత్ర, జర్జరీ నృత్యం, అష్టపదులు, తరంగాలు, పదాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలు, భామా కలాపం, గొల్ల కలాపం లాటి వెన్నో స్పష్తంగా కనుపించేలా చేసేవారని రేణుకా ప్రసాద్ గారు వివరించారు.

కూచిపూడి లో రెండు సంవత్సరాలు ఉండి, ఆ తరువాత హైదరాబాదులో కూచిపూడి కళాక్షేత్రం స్థాపించారు.  వేములవాడ మొదలగు ప్రాంతాల్లో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చేవారు.  లవుడు పాత్రలో ఒదిగిపోయారు ఆయన నాజూకుగా, అందంగా ఉండటంతో. కలవ శాస్త్రి గా గయ్యాళి పాత్ర అయినా, జర్జరీ నృత్యం అయినా, అష్టపదులూ, తరంగాలు, పదాలూ, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలూ, భామాకలాపం వంటివి స్పష్ఠం గా కనుపించేలా ప్రదర్సనలు ఉండేవిట.  స్వరం మీద నాట్యం చేసేవారుట, అంటే పాట/మాట లేకుండా అన్నమాట. వినూత్నంగా చెక్క మీద పళ్ళెం పెట్టి చేసేవారుట.  ప్రహ్లాద మరియు అటువంటి యక్షగానాలు నేర్పేవారుట నిజామాబాదు వంటి ప్రదేశాల్లో.
కూచిపూడి నాట్యకళ ప్రచారం, సినీ రంగం యొక్క ప్రభావానికి లోనై, చిన్న చూపు చూస్తున్న రోజుల్లో, ధనార్జన కేంద్రంగా కాకుండా ప్రచారం చేసిన మొదటి వ్యక్తి భాగవతుల రామకోటయ్య గారు అనీ, మూకోపనిషత్తు ప్రకారం - ప్రఙ్ఙ కలిగిన వాడు ప్రాఙ్ఞుడు  - ఒక వస్థువు యొక్క వివరాలు తెలుసుకుని, దానిని గురించి అవగాహన ఏర్పరచుకోవటం - ఆలోచనలలో నవ్యత, దివ్యత, భావ్యత మరియు ప్రాఙ్ఞత  చూపటం జరుగుతాయి, అటువంటి వాటికి ప్రధమంగా నాంది పలికిన వారు శ్రీ భాగవతుల రామ కొటయ్య గారు అని అనటంలో ఎటువంటి సందేహమూ లేదని నొక్కి వక్కాణించారు శ్రీమతి సుధామాల గారు ఆయన యొక్క విషిష్ఠ వ్యక్తిత్వాన్ని వర్ణిస్తూ. 

ఆ కార్యక్రమనికి విచ్చేసిన అతిథులు శ్రీమతులు సువర్ణలత గారూ, ప్రసన్న రాణి గారూ,  అనూరాధా జొన్నలగడ్డ గారు, పాల్గొన్న కళాకారులు డా. శేతూరాం గారిని, డా రమాదేవిగారిని, సుధామాల గారినీ, రేణుకా ప్రసాద్ గారినీ, డా కుటుంబరావు గారినీ, చలపతి శాస్త్రి గారినీ, రోహిణీ ప్రసాద్ గారినీ, సాయి మొహిత్ గారినీ, రమేష్ కుమార్ గారినీ, కీర్తనా రెడ్డి మరియు వీణా గణేష్ లనూ, కేసవరాం గారూ, ఎంతో ప్రసంసించారు, సత్కరించారు. 

స్త్రీ-పురుష పాత్రలను స్త్రీ లతోనే వేయించేవారు ఆయన, నిజామా బాదు లో యక్షగానాలు నేర్పినప్పుడు. తన ముగ్గురు కూతుళ్ళకూ నాట్యం నేర్పించారు, కూచిపూడి ఎక్కువగా మొగవాళ్ళే చేసేవారు ఆ కాలం లో. ఆయన నిరాడంబరంగా ఉండేవారనీ, విద్య నేర్పటమే పరమార్ధం గా ఉండేవారనీ, విప్లవాత్మకంగా ఉండేదనీ చెప్పారు.
దరువులు నేర్పుతూ, సంధర్భొచితం గా, జీవితంలో ఎలా నడచుకోవాలో నేర్పుతూ నాట్యాన్ని  ఒక మార్గం గా, ఒక మాధ్యమంగా తీసుకుని బోధించేవారనీ వివరించారు.  1960 లో నవ్య నాటక సమితి తో అనుబంధమేర్పడింది. తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నప్పుదు వేమరాజు నరసిం హారావు గారు, సాంస్కృ తిక కార్యక్రమం ఏర్పాటుచేసి 1958 లో కూచిపూడి నృత్య  అకాడమీ స్థాపించిన శ్రీ భాగవతుల రామ కోటయ్య గారిని ఆహ్వానించారు.  అందులో "పద్మ రాగం"  అనే కథ - సూర్య గ్రహణం, పద్మము లోంచి రావటం,  పద్మాలు అటుగా తిరగటం వంటివి ఇతివ్రుత్తంగా కా ప్రదర్శన ఇవ్వటం జరిగింది.  11-12 ప్రదర్శనలు వన పర్తి , విజయవాడ, మొదలగు చోట్ల ప్రదర్శితమైనదని వివరించారు సుధామాల గారు.  వారి తల్లి గారు - శ్రీమతి మణిమాల గారు కూడా అందులో పాల్గొన్నారనీ, ఆనాటి హిందు లో రెవ్యు చూపించారు.  జోగరాజు గారు, సోమయాజులు గారు, వేదాంతం లక్ష్మీ  నారాయణ గారి శిష్యులు. డా సర్వేపల్లి రాధాక్రిష్ నన్ గారు వొచారనీ తెలిపారు.  ఆనాటి పద్మప్రియ, శేషమ్మ, సుజాతా గార్లు ముందు చేసేవారనీ, తరువాత పద్మ, సరోజ, జయశ్రీ, మణిమాల మొదలగు వారు దానిని ప్రదర్శించేవారనీ తెలిపారు. 1983 లో తిరిగి భాగవతుల శేతూరాం గారు పద్మరాగం, గురజాడ వారి యమన రాజు కథ లాటివి ప్రదర్శించారనీ వివరించారు. ఆనాటి గవర్నర్ గారు ముఖ్య అతిథి గా విచ్చేసారనీ చెప్పారు.

సామాజిక ఇతివ్రుత్తాలు తీసుకుని నృత్య రూపకాలు  చేసేవారు - 1960 లో పద్మరాగం, 1962 లో రైతే రాజు, లవణ రాజు కథ, నవ భారత్ లాటివి కూడ ప్రదర్శించారు. 1972 లో చర్చా కార్యక్రమం - హైదరాబాదు లో జరిగింది.  అందులో మోడరేటర్ గా P S R అప్ప రావు గారు, వేదాంతం జగన్నాథ శాస్త్రి గారు, నటరాజ రామక్రిష్ణ గారు,  దీక్షితులు గారూ, నాగేశ్వర రావు గారు  పాల్గొన్నారు.  శ్రీ భాగవతుల రామ కోటయ్య గారు మేకప్ చేసేవారుట,  నగలు చేసి వాడేవారుట.  ఆయన భామాకలాపం చేసినప్పుడు మొదటగ సురభి కేశవరాము గారు మేకప్ చేసారుట హైదరాబాదు లో.

భాగవతుల శేతూరాం గారు తండ్రి గురించి చెబుతూ తన పరిశోధనా పుస్తకం (థీసీస్) లో ని కొన్ని విశేశాలు, తను చేసిన ముఖాముఖి సమావేశాలు యథతథంగా చదివి వినిపించారు (అంటే మాట్లాడితే భావొద్వేగం కలిగి మాటలకి వేరే అర్థాలు రావటానికి అవకాశం వస్తుందని).  తెలంగాణా లోని గ్రామీణ ప్రాంతాల్లో కూచిపూడి ని తమ తండ్రి గారు, భాగవతుల రామ కొట్టయ్య గారు, ఎలా ప్రాచారం లోకి తెచ్చారో వివరిoచి ఉంది - సాక్షాల రూపంలో, ముఖాముఖి సమావేశాల రూపంలో.  1948 పోలిస్ ఆక్షన్ సమయానికే కూచిపూడి అదిలాబాదు లోనూ, భద్రాచలం లోనూ ప్రదర్శిత మయ్యేదని తెలిపారు.  చెన్నూరులో అక్టోబర్ 1947 లో పగటి వేషాల మాదిరి ఆడేవారని తెలిపారు.  ఇవన్ని సత్తిరాజు సీతాపతిరావు గారు, వారి తనయుడు, రాంబాబు గారు, కాకతీయ విశ్వవిద్యాలయం ఫార్మసీ ఆచార్య  చెపారనీ వివరించారు. ఆయన వేషం కడితే అమ్మాయిలా ఉన్నారని పొన్నగంటి శీతన్న గారు వెయ్యి రూపాయి లిస్తాను, ఆలింగనం చేస్తావా అని అడిగారుట.  ఆ రోజుల్లో మరి పెట్రొమొక్ష్ లైటులు పెట్టేవారు - వాటిని పార్థసారథి గారు, జగన్నాథ శాస్త్రి గారి తనయుదు వరదాచారి గారు, కూతురు వైదేహి, జక్కపల్లి కృష్ణయ్య గారు, దేవరాసు కృష్ణయ్య గారు,    దేవరాసు రాజన్న గారు మొదలగు వారు కూడా  పాల్గొనేవారుట.  - జతులు విపులంగా చెప్పేవారుట. కరీం నగర్లో, మంథని లో రెండు (1949), భద్రాచలం లో రెండు, చెన్నూరు లో రెండు, మంచీర్యాలలో నూ, కన్నేపల్లి అగ్రహారం లోనూ జస్టీస్ S. P. జగమ్మొహన రెడ్డి గారింట,  రాజిరెడ్డి గారు, వరదాచారి గారు, భాగవతుల రామకోటయ్య గారు ప్రదర్శనలిచ్చారుట.  

జూలై 1956-57 టైం నాటికి సినిమా ప్రభావం ఎక్కువై పోయి కళకు ఆదరణ తగ్గింది.  భామ వేషం, జాలరీ నృత్యం, గొల్ల కలాపం, పదాలు, చేసేవారు.  పదాలు చేస్తున్నప్పుడు హావభావాలు చాలా బాగుండేవి,  గొప్ప భావన. చాలా ఆకట్టుకునేలా ఉండేవని తెలిపారు.  చివరగా 26th  జనవరి 1963 చెన్నూరు లో ప్రదర్శన ఇచ్చారని తెలిపారు.  ఆయన పారితొషికం రూ ముప్పది నుంచి యాభై మాత్రమే ననీ కూడ తెలిపారు.
 
ఆయన ప్రయాణం చెన్నూరు - మంచీర్యాల మధ్యన - ముందు బస్సు, కాజీపేట కి పాసింజరూ, విజయవాడకు మరో పాసింజరూ, బందరు దాకా బస్సు - అలా సాగేదని - విసుగూ విరామం లేకుండా.   చందన చర్చిత, భామాకలాపం లో హాస్యం చాలా బాగుండేదని, పళ్ళేం మీద చేసినా, గొల్ల కలాపం చేసినా, జాలారీ నృత్యం చేసినా  చూసితీరాల్సిందే ననీ చెప్పారు.  

అటు తరవాత వారి అన్న గారైన భాగవతుల కుటుంబరావు గారు మాట్లాడుతూ.......తాను నృత్యం నేర్చుకోక పోయినా..తన 16-23 ఏళ్ళ వయస్సు ఉన్నప్పుడు రోజూ భోజనానంతరం చర్చలలో పాల్గొనేవారనీ, 1979 లో ఆయన పరమపదించేవరకూ అని చెప్పారు. ఆయన ఒక విశేషమైన వ్యక్తి అనీ నిపుణత్వము-వ్యక్తిత్వమూ ఉన్న కళాకారులనీ,  సముద్రం అంత లోతుగా ఉండేవారనీ తెలిపారు. అటువంటి వారే సమాజానికి అవసరమైన వ్యక్తులుగా అవుతారు అనీ, వ్యక్తిగా ప్రాఙ్ఞుడు అని అన్నారు.  ఆయన ఎంతో ఉదారులనీ, తన తోటి కళాకారులకి ముందుగా, వచ్చిన డబ్బు పంచేసి, తరవాతనే, మిగిలితే - తీసుకునేవారనీ, నిబద్దత, స్నేహపూర్వక బంధము, అందరూ సమానం అనే దృష్టి కోణం ఉండేదనీ వివరించారు.  ఆయన ఆ గుణం చూస్తే, శంకరాభరణం సినీమాలోని శంకరశాస్త్రి పాత్ర గురుతు వస్తుందనీ తెలిపారు.  తొందర తొందరగా ఆరంగేట్రం లాటిది డబ్బిచినా చేసేవారు కాదనీ చెప్పారు.  సంవత్సరానికి నూటపదహార్లు ఫీసు తీసుకునేవారనీ, చాడీలు చెబితె నచ్చేది కాదనీ, తోటి కళాకారులని చిన్న చూపుగా చూసినా, మాట్లాడినా  నచ్చేది కాదనీ వివరించారు. 

ఆ తరువాత అతిథులకీ, గురువులకీ సమ్మానం జరిగింది.  తదనంతరం భాగవతుల రామ కోటయ్య గారి బాణీ లోనే ప్రదర్శన జరిగింది. తెలంగాణమున కూచిపూడి  బాణిని నిలిపిన ప్రప్రథమ నాట్యాచార్యులు.  భగవంతుని కృపవల్లనో, గురువు గారి కృపవల్లనో, గొల్లకలాపం అరుణకుమారి గారు నేర్చుకుంటుంటే చూసి నేర్చుకున్నాను అన్నారు భాగవతుల శేతూరం గారు.  ఉషారాణి గారు, ప్రసన్న రాణి గారు కూడ ఆయన వద్ద నేర్చుకుని చేసిన వారే.

1.  గొల్లకలాపం లోని ప్రవేశ దరువు కొద్దిగా. డా రమాదేవిగారు, భాగవతుల శేతూరం గారు. విఘ్నేశ్వర ప్రార్థన మరియు వాచికం.
2.  రామనాటకం లోని నృత్యాంశము - పట్టాఅభిషేక సన్నివేశం. వేదాంతం సత్యనారాయణశర్మ గారు నేర్పించారు.  దీనిని రోహిణీ ప్రసాద్ మరియు శ్రీ లత - రాముడు, భరతుడు క్రింద చేసారు.
3.  రమేష్ కుమార్ గారు ఆనాడు (1981) నేర్చుకున్న గణపతి కౌత్వం చేసారు - యథాథతం గా
4.  ఆధ్యాత్మ రామాయణ కీర్తన -  రోహిణీ ప్రసాద్ మరియు సాయిమోహిత్ - ఓం నమస్సివాయతే  ఓం నమోభవాయ
5.  వింతలు వింటివా యశోద -  ఓ యమ్మా నీ కుమారుడూ మా ఇండ్లను పాలు పెరుగు మననీడమ్మా  - కీర్తనా రెడ్డి, వీణా గణేష్
6.  తిల్లనా - తోడి రాగం - రోహిణీ ప్రసాద్ మరియు సాయిమోహిత్ - ధీం ధీం తనన దిరన ధీంత నన

ఈ నాట్య ప్రదర్శనలతో ఆనాటి కార్యక్రమం పూర్తయ్యింది


.............................................xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx........................................

Wednesday, June 20, 2018

అథ హస్తాభినయ ప్రకాశికా



అథ హస్తాభినయ ప్రకాశికా
త్యాగరాయ గాన సభా ప్రాంగణమంతా గురువు, శిష్యులు, ప్రతిశిష్యులు తో నిండి పోయి సోభాయమానంగా వెలిగిపోయింది.  గురువు గారి దగ్గర నేర్చుకున్నవే కాకుండా తమంతట తాముగా చదివి, పరిశొధించి, ఆలోచన చేసి తమకు తోచిన రీతిలో తమ భావాలను శిష్యుల ద్వారా ప్రదర్శింపజేశారు గురు శ్రీ భాగవతుల శేతూరాం గారి శిష్యురాళ్ళు - శ్రీమతులు సుధామాల, రేణుక, రోహిణీ గార్లు.  యోగా, వేదం, నిత్య పూజా విధానం, లోక ధర్మ్యం, నాట్య ధర్మ్యం, ఆయుర్వేద శాస్త్రం, సనాతన ధర్మం లోని అన్ని క్రతువులలోనూ వినియోగించే ముద్రలు, వాటి యొక్క దైనందిన జీవితంలో ని ఆవశ్యకత, హస్త రూపంలోకి మారి ఉపకరించ బడటం ఎంతో నేర్పుగా చెప్పారు.  అయితే ఒకానొక సమయంలో పక్క దారి పడుతున్నారా అనిపిస్తున్నప్పుడు, సుధామాల గారు తమ శిష్యులతో "గాయత్రీ" మంత్రం లోని ముద్రలు చేయించారు. దానినుంచే హస్తాలు వచ్చాయి అన్న విషయం విశదీకరించారు.
అథ యోగానుశాసనం అని పతంజలి యోగా మొదలవుతుంది. అంటే - - Well! I am going to tell about yoga అని చెప్పవచ్చును. భాగవతుల రామకొటయ్య గారి ని మొదటి సారిగా తమ ఇంట్లొ చూసానని అన్నారు సంస్థ కార్యదర్శి శ్రీ వేమూరి విజయ కుమార్ గారు.  వారి తండ్రి గారే "నవ్య నాటక సమితి" ని ఏర్పాటు చేసినది.  ఆయన తనయుడే ఈనాటి సభకి అధ్యక్షత వహించిన శ్రీ భాగవతుల సేతూరం గారు,  గురు సత్కారం చేస్తూ ఆయన వీరందరూ "విషయ పరిజ్ఙానం" లో దిట్టలు అని చెప్పవచ్చును అని అన్నారు.
నవ్య నాటక సమితి లో వేదాంతం ప్రహ్లాద శర్మ గారూ, వేదాంతం జగన్నాథ శర్మ గారు కూడా సభ్యులనీ చెప్పి, 5 రోజులు పోటీలు జరిగేవనీ చెబుతూ సాంఘీక నాటకాలు "ఛండాలిక", లవణ రాజు గారు ప్రదర్శించిన బహుసహ మొదటి భావ ప్రకటన "పద్మ రాగం " లాటి నృత్య నాటికలు ప్రదర్శితమయ్యేవని వివరించారు.  రామాయణ శబ్దం చేస్తూ పోటీల్లో రోజంతా ఆడి ఆడి అలిసిపోయి కాళ్ళు లాగేసి తీరా స్టేజీమీద "ఆడిన మృగమది వెంబడిపోతివి.."  చేసే సమయానికి, చెయలేక కూర్చుని చేసి వచ్చేసాను అని చెప్పి, తండ్రి గారు కోప్పడతారని అనుకుంటుంటే రెండవ బహుమతి వచ్చి, చాలా బాగా చేస్తాడు అని అనిపించుకునే స్నేహితుడికి కన్సొలేషన్ బహుమతి వచ్చిందని చెప్పి, సంతోషంగా అక్కడి నుంచి పారిపోయాడట.
సుధామాల గారు ప్రసంగిస్తూ -  వేదాలనుంచి ప్రామాణికంగా వస్తుందని. విదేశాలలోన నాట్యాలు ఎక్కువగా లోకధర్మి మాత్రమే కనిపిస్తుందనీ, భారతీయ కళలలో లోక ధర్మి, నాట్య ధర్మి కలిపి ఉంటాయనీ ఉద్దెశ్యపడ్డారు. వేదాలు ముద్రలతో చూపటం. గాయత్రి మంత్రంలో 24 ముద్రలు + 8 ముద్రల సముదాయంగా వివరించారు.
చాల రకాల ముద్రలు చేతులతో చెసేవి వేదిక కర్మలందు, మంత్రాలు పలికేటప్పుడు, వాడబడతాయి - ఉదా:  "సుముఖం" చెప్పేటప్పుడు రెండు పతాక హస్తాలని దగ్గర చేర్చి లోనికి చేసినట్లు చూపెడతాం - శరీరంలోనికి ఆవాహన చేసుకోటానికి చేస్తున్నాము అని అర్థం, అలాగే ఎన్నో రకాల వినియోగాలు ఉన్నాయి.
చేతిని చాపి మరో చేయి బొటన వ్రేలు మధ్యన ఉంచాలి.  ఈ విధంగా రెండు చేతులతో చేసి, వ్రేళ్ళు  తగిలించి ఉంచాలి.  ఆ తరువాత, రెండు పతాక హస్తాలను ఒక దాని ముందు మరొకటి పెట్టి తిప్పినట్లయితే వేడి పుడుతుంది. దీనినే "Aura" అంటే - "energy field" అని అంటారు.
purification of water కి కూద ముద్ర ఉంటుం దని అన్నారు ఆమె. నృత్త హస్తాలు - నాట్య శాస్త్రం లో  30; అభినయదర్పణం లో 13; భరతర్నవం లో 20 ఉన్నాయనీ, అవన్నీ కరణాలలో ఉపయొగపడతాయనీ చెప్పారు. శివుడు సంధ్యా సమయంలో తను చేసే నాట్యాన్ని పెట్టమని "తండు" నికి చెప్పా డు కావున "తాండవం" అనే పేరు వచ్చిందని అన్నారు.  ఈశ్వరుని ప్రీతి పాత్రుడై   ఉన్నవానికి మాత్రమే శివుని కరణాలు నేర్చుకోగలుగుతారని చెప్పా రు.  PSR appa rao గారివి 25 పుస్తకాలు.  "నారదీయ శిక్ష" అన్న పుస్తకం క్షే త్రయ్య నాట్య శాస్త్రానికన్నా ముందుది - సప్త స్వరాలకి కూడ ముద్రలున్నాయని అన్నారు - ఉదా:  గుర్రపు శబ్దం. కాలమానం గురించి, ఋతువుల గురించి చెబుతూ - ఉదా: సందంస హస్తం వర్షానికీ, సర్పశీర్ష హస్తం క్షీర సముద్రం గురించి  వాడతారని వివరించారు.  చివరగా వారి శిష్యురాలు మేఖల -  "నిన్ను చూసి నాలుగైదు నెలలాయె మువ్వ గోపాలా" అనే క్షేత్రయ్య పదాన్ని చక్కగా అభినయించారు.      
రేణుక గారు మాట్లాడుతూ ముద్ర అన్నది మనస్సుకి మరియు బైటి ప్రపంచానికీ ఒక వారధి.  భావ వ్యక్తీకరణకి వీలయినది.
Palm is the index of sub-conscious mind.
Fingers are the index of conscious mind.
జప-తప-మంత్రాది నిత్య పూజలలో ముద్రలు వాడటం జరుగుతుంది.  మన ఇదు వ్రేళ్ళు కూడా పంచ భూతాలని గుర్తుగా సూచించుతాయని, ఆయుర్వేద శాస్త్రం లో ఒక్కక్క వేలుకీ ఒక్కొక్క ఆరోగ్య సూత్రం  ఉందని వివరించారు. Pranik healing, Reiki healing వాటిలో కూద ముద్రలు ఉపయోగపడతాయని చెప్పారు. భావ సూచికలు, దేవతా సూచికలూ, ఋషి ప్రోక్తాల్లో కానీ, కలశ పూజలో కాని, ఆవాహన, సాక్షి ముద్రలోనూ, సానిధ్య ముద్రలోనూ, దేవతల నుంచి వచ్చినదే.  నైవేధ ముద్ర, జపం చేసేటప్పుడు కూడా హస్తాలు ముద్రలు ఉన్నాయి.  ఉత్తమ అభినయం లో తక్కువ, మధ్యమం లో మధ్యస్తంగా, అథమంలో ఎక్కువ అభినయం ఉంటుంది.
నవ రత్నాలకీ, రాసులకీ, ముద్రలు ఉన్నాయని చెప్పా రు.  తమ శిష్యురాళ్ళతో "ఇన్నిరాసుల ఉనికి", "తిరు వీధుల తిరిగేను" చేయించారు.  వేదాంతం జగన్నాథ శర్మ గారిని ఒకసారి మైసూరు మహారాజు గారి ఆస్థానంలో 1-10 అంకెలకి వేదాంతార్థము, నాట్యార్థము కుడా  అప్పటికప్పుడు చెప్పమన్నారుట.  అంకెలకి కూడా  హస్తాలు ఉంటాయని వివరించారు.
రోహిణి గారు మాట్లాడుతూ... శాస్ట్రం మరియు సంప్రదాయం.  శాస్ట్రం నిర్దేసించటం వ్యాకరణాది గ్రంథాల ద్వారా. సాంప్రదాయాన్ని శాసించితే వచ్చేది అమరకోసం ద్వారా, అది గురువుని ఆశ్రయించి నేర్చుకోవాలి.
అథ అనగా - మంగళ వాచకం.
హస్తాభినయం - హస్తములను ఉపయోగించి చేసే నర్తనం
ప్రకాశికా - ప్రకాశింపచేసేది.  "భం" అనే పదం భారతీయులు ఇష్ట పడతారు.
అభినయం - అభిముఖంగా - (taking forward). అంటే ఒక కథ ని ప్రేక్షకుల దగ్గరకు చేర్చటం.  దానికి వారధి లా వ్యవహరించటం.  అదొక చేష్టా విశేషం.
శాఖాభినయము - అంటే మన శరీరానికి చేతులు, కాళ్ళు లాటివన్నీ చెట్టునకు శాఖలు ఎట్లాగో అలా అన్నమా ట.  శాఖ అనగా విచిత్రమైన.....వాటి కదలికలే - ప్రధాన కదలికలు. 
హస్తాభినయం - శౌష్ఠవము ఉండాలి, posture ఎలా ఉండాలి అంటే - చతురస్రం లో ఉండాలి.  భరత నాట్యం లో, కూచిపుడి లో,  సాత్రియ లో, కథక్ లో, విలాసిని లో posture ఎలా ఉంటుందో చేసి చూపించారు.
శిల్ప, నాట్య, వైదిక కర్మలలో కూడా ముద్రలు ఉపయోగపడతాయి.  వైదిక ముద్రలు,  కాంతిక ముద్రలు, జపాలు, దేవతా ఆవాహనం, తాంత్రిక ముద్రలు, లౌకిక ముద్రలు ఉంటాయని వివరించారు.
ముద్రలు - దేవతలకి సంతోషం కలిగించేది. మోదకం, ద్రావణం, attraction, negative గా చేసేది.  త్రికరణ శుద్ధిగా జరిగే పూజ, కర్మ ముద్రల ద్వారా కలుగుతుంది.  Result:  అంతర్గతి అంతే internalizing.  అంగవిక్షేపం - static నుంచి moving వైపు వెడుతుంది అంతే మోహం కలుగుతుంది.  ఇది external result.  ముద్రలు పట్టటం అంటే రాసోత్పత్తికి తోడ్పడటం.  అభినయానికి ముద్రలు ఉపయోగం హస్తాలుగా తీర్చిదిద్దుకుంటాయి. 
నాట్యానికి ప్రమాణాలు మూడు - లోకము, వేదము, ఆధ్యాత్మ్యం.  వీటికి authentication - లోకము అంటే సూర్యచంద్రులు ప్రమాణం.  వేదాలకి శాస్త్రం అంటే ఇక్కడ నాట్య శాస్ట్రం ప్రమాణం.  తనకు తానుగా తెలుసుకున్న విషయమే ప్రామాణం - ఆధ్యాత్మ్యం.  వారి గురువులు శ్రీ భాగవతుల సేతూరాం గారు - దేక్షితార్ కృతి కి రూపకల్పన చేసారు.  ఆయనకి తెలుసో తెలియదో తెలియదు కాని - ఈ పైన చెప్పిన మూడు ప్రమాణాలూ అందులో నిక్షిప్తమైనాయి.  వరద అభయ హస్తము - "కంజ దళాయ తాక్షి" లో శాస్త్ర వినియోగం.  రస-భావ-చేష్టలకి - "మామవ శివ పంజర స్తుతి" లోకము.  రత్న సిం హాసనం - శిఖర కాకుండా అర్థచంద్ర ఉపయోగించారు - ఆధ్యాత్మ్యం.
భామాకలాపంలో - హస్తాలు విరుధం గా ఉపయోగించటం జరుగుతుందీని చేసి చూపించారు.  అంటే అందులో "మాధవి" పాత్ర పండటానికి - దక్షిణ భారతం, సంగీతరత్నాకరం, సొమేస్వర పురాణం, బాల రామభరతం లో హస్తాలు స్త్రీ లింగ, పుం లింగ, నపున్సక లింగాలుగా విభజింపటమైనదని చెప్పరు. "తల పాకములు" అన్నవి హస్తాలు వాడినా  లేకపోయినా - భావాన్ని ప్రక టించేవిగా హస్తాలు చేస్తారు అని ముగించారు.