Monday, April 1, 2019

భాగవత పారిజాత కలాప నృత్య విరాజిత సత్యభామ (BHAGAVATA PAARIJAATA KALAAPA NRUTYA VIRAAJITA SATYABHAAMA)


నవ్య నాటక సమితి డైమండ్ జూబ్లీ సెలెబ్రేషన్స్ లో భాగంగా,  భారతీయ శాస్త్రీయ నృత్య , సంగీత రీతుల పరిశోధనాత్మక ప్రసంగ పరంపరలో, 29th అక్టోబరు, 2019 సోమవారం సాయింత్రం, చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో,  "భాగవత పారిజాత కలాప నృత్య విరాజిత సత్యభామ" అనే  సెమినార్ జరిగింది.
అందులో భాగంగా ప్రఖ్యాత నాట్యాచార్యులు, హంసా అవార్డు గ్రహీత , శ్రీమతి మద్దాళి ఉషా గాయత్రి, ‘అభినవ సత్యభామ’,సంగీత నాటక అకాడమి పురస్కార గ్రహీత , శ్రీ కళాకృష్ణప్రముఖ నాట్యాచార్యులు శ్రీ యేలేశ్వరపు చలపతి శాస్త్రిగారు, నాట్యస్వర కన్వీనర్, శ్రీ జి.వి. అన్నారావు గారు , ‘లాస్య కౌముది డా.పి. ఇందిరాహేమ, కూచిపూడి నర్తకీ శిరోమణి జి. ఇందుమతి గార్లను  ఆదరపూర్వకంగా సత్కరించుకున్నది టీం-నవ్య నాటక సమితి.
1975-76 లలో చిక్కడ పల్లిలో విజయ కుమార్ గారి ఇంటి వద్ద గురు జగన్నథ శర్మ గారు, కళా క్రిష్ణ గారు, ఉషా గాయత్రి గారు ఉండేవారుట. ఆయనే హేరోయిన్ గా వేసారుట, All India competitions కి జుద్గె గా వచ్చారుట.  ఉషాగాయత్రి 1977-78 లో "గీత గోవిందం" choreography, rehearsals ఇంట్లోనే అయ్యాయిట. అందులో కత్తి పట్టు కోవాలిట.
ముందుగా శ్రీమతి, జి ఇందుమతి గారు, కూచిపూడి లో సత్యభామ, గురించి మాట్లాడారు. సత్యభామా కలాపం గురించి తెలియని వారుండరు. భామనే సత్యభామనే ‘, ఈ పాట ప్రతి తెలుగు నోట ఆడుతూనే వుంటుంది. కానీ యీ భామా కలాపంలో పలు రీతులువున్నాయనివాటి గురించి చాలా మందికి తెలియదు. ఈ భామాకలాపంలో సత్యభామ, కృష్ణుల ప్రేమ కథాంశం. ఇందులో మాధవి,కృష్ణుడు,సత్యభామ ముగ్గురు పాత్రలు వుంటాయి. జీవాత్మ, పరమాత్మల అనుసంధానానికి ప్రతీక, ఈ భామాకలాపం. సత్యభామ విరహంలో, జీవాత్మ, ఆ పరమాత్మ కోసం పడేతపన, వేదన అనేక మార్గాలలో కనబడుతుంది - జపం, ఆరాధనా మొ". సత్యభామ మధుర భక్తికి నిదర్శనం. దీన్ని సిద్ధేంద్ర యోగి అద్భుతంగా సృష్టించారు అన్నారు ఇందుమతి గారు. 
విభావ-అనుభావ-వ్యభిచారీ భావాలు, అష్టవిధ నాయికల్లో ఒక 5-6 నాయికలూ, నవరసాలుమాధవి ద్వారా హాస్య రసం పండించే కలాపాలు, అలంకార శాస్త్రాన్ని గుప్పించి, అన్నీ కలబోసినది భామాకలాపం - సిద్ధేంద్ర  యోగి రచనలు చేసారు అని అన్నారు. ఓలేటి పార్వతీశం గారు శిథిల భాగాలన్నీ కూర్చి పూర్తి చేసారు. 
పూర్వం మూడురోజులు ప్రదర్శించే వారట. సత్యభామ జడ గురించి మాట్లాడుతూ , ఇందులో వేణి వృత్తాంతం బహు రమణీయం అన్నారు. పాము పాడగ విప్పినట్లుంటుంది. 27 నక్షత్రాలు,సూర్య చంద్రులతో శోభాయమానమై విరాజిల్లుతుంది . సత్యభామ జడ కేవలం లాస్యాభినయానికి ప్రతీక కాదనీ, దానిలో యెంతో పరమార్ధముందని చెప్పారు. విశ్వ కర్మ చెప్పిన దానిని బట్టి మోహినిగా విష్నువు కూడా జడ ను ధరించాడు. సత్యభామ ఖండిత నాయిక. అందువల్ల జడను ఆయుధంగా కూడా వాడటం పరిపాటి.  అందుకే మనకు బాపు-రమణల రెండు జడల సీతలు జడ ను వాడే రీతిని ఎలా కూడా చూపించడం వారి సినిమాలకు ప్రత్యేకం. ఇందులో దరువులు , ఆనందభైరవి, భైరవి, ముఖారి రాగాలలో, విలంబ లయ లో  వుంటాయి అని అన్నారు. భామనే, సత్యభామ నే…. అంటూ  ప్రవేశ దరువు, రాయబారం, మాధవి ఎంత్ర్య్, సత్యభామ - మాధవి ల సంభాషణ వాచికం లొ చెప్పారు.  మందులు, ఓషధములు గురించి మరియు, వారాల నగల గురించి, గ్రహములు, ఆభరణములు, పుష్యరాగం వంటి మంచి రాళ్ళ గురించి, బ్రుహస్పతి గురించి ఎన్నో రకాల వివరాలు మాధవి పాత్ర ద్వారా పలికిస్తారు.  చక్కటి అభినయంతో ప్రదర్శించి చూపారు. వినికి పట్టు, రాయబారం, మంజుల పట్టు, మూర్చ పట్టు, గ్రంథం, మర్మాల పట్టు ల గురించి వివరించారు. అద్భుతంగా సాగింది వారి ప్రసంగం.

నవ్యనాటక సమితి సమన్వయ కర్త శ్రీమతి సుధామాల గారు మాట్లాడుతూ, యీ భామా కలాపం మీద ప్రబంధ సాహిత్య ప్రభావం చాలా వుంది అన్నారు. నాట్యం,సంగీతం, హరికథ ప్రక్రియలు , పూర్వం ప్రజలకి విజ్ఞాన సాధకాలుగా వుండేవన్నారు. ఇందులో మాధవి పాత్ర, జీవాత్మని పరమాత్మ దగ్గరకు నడిపించే గురువు అన్నారు. మధ్యలో హాస్యం, రత్న శాస్త్రం, అలంకార శాస్త్రం లాంటి యెన్నో విషయాలు ఆవిష్కరింప బడతయ్ అన్నారు. 16 వర్ణలలో చేసేది - చిన్న విషయం తీసుకుని 3 - 5 రోజులు పొడిగించి పొడిగించి చేసేవారని చెప్పారు.  నాట్యం కార్యక్రమం, సాయిత్యం-రసాలు - సామాన్య ప్రజలకు చెప్ప టానికి, మాధవి పాత్ర ఒక "గురువు" లాగా జీవాత్మ నుంచి పరమాత్మ వైపు వెళ్ళటానికి, నడిపించటానికి చణుకులు, చలోక్తులూ విసురుతూ, హాస్యం పండిస్తూ సాగేదనీ చెప్పారు.   

తరువాత శ్రీమతి ఇందిరా హేమ గారు తూర్పు భాగవతం గురించి మాట్లాడారు. తూర్పు అంటే, ముఖ్యంగా శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతపు కవులు, గాయకుల సృష్టి ఈ భామాకలాపం. కొంతమటుకు జానపద ప్రక్రియ లాగా వుంటుంది.  ఇందులో వాద్యకారుడు మృదంగం మెడలో కట్టుకు వాయిస్తారుట. రాత్రి 8గంటలకు మొదలయి, తెల్లారి 8 గంటల దాకా ప్రదర్శన సాగుతుంది, అంతసేపు నుంచొని వాయించాలి . దాన్నే మద్దెల అనికూడా అంటారుట.  మగవారు స్త్రీ  వేషం వీసుకుని చేస్తారు.  తెరపట్టు కుని చేస్తారు.  20 ని!! రాగం తీసి, ఆరున్నర శ్రుతి లో అప్పుడు భామనే మొదలు పెడతారు. చదువు వచిన వారు కాని, పుస్తకం పట్టుకున్న వారు కాని ఉండరు.  అన్నీ నోటికే చెబుతారు. 7 ఉత్తరాలు మాత్రమే దొరికాయి.  చూరులో పెట్టటం మూలంగా పోయాయి పుస్తకాలు.  కాకర పట్టు నరసిమ్హా చారి గారు, కూన పాటి విజయ రాఘవ గారు వీరందరికి బంగారు తొడుగు చేయించి పోషించారు.  చోడవరం, పెద్దాపురం జమిందారులు పోషించిన కళ ఇది.  ప్రవేశ దరువు గంటన్నర నుంచి రెండు గంటలు  చేస్తారు.  దది మదన దరువు ...................దదిదీ...దదిదీ...విందనా...మదనా అనుచును చేస్తారు.  చూర్నిక లోని గుక్క తిప్పుకోకుండా చెప్పెస్తారు. మ్రుదంగం చాలా బాగుంది.  రెండు చేతులతో ఒక వైపే వాయిస్తారు. క్రిష్నుని ముద్ర కొద్దిగా వేరుగా పడతారు.
ఇది గురువుల దగ్గర నుంచి, తల్లి తండ్రుల దగ్గరనుంచి వంశపారంపర్యంగా నేర్చుకుంటారుట. 1971 లో నటరాజ రామకృష్ణ గారు దీన్ని గ్రంధరూపంలో తీసుకొచ్చారు అన్నారు. భగవంతుడి గురించి చెప్పేదంతా భాగవతం అని అన్నారు. జమిందారులు, సంస్తానాధీశ్వరులు దీనిని పోషించేవారన్నారు. ఇందులో మృదంగం రెండుచేతులూ ఒక పక్కవుంచి వాయిస్తారని, నృత్యం వుంటుంది కానీ, దేశీ పద్ధతిలో వుంటుంది, హాస్యం కూడా విభిన్నంగా వుంటుంది అని అన్నారు. విజయనగరం బాణి, బొబ్బిలి బాణి అని వుంటాయి. ఒకరు స్టెప్పులకి ప్రాధాన్యత నిస్తే, మరొకరు సంగీతానికి ప్రాధాన్యత నిస్తారు. ఇందులో ఏడు వారాల నగల వర్ణన విశేషంగా వుంటుంది. మూడున్నర నిమిషాల పాటు సమాసాలతో సంభాషణలు, చదువు రానివారు చెప్పటం విశేషం. 

చివరగా శ్రీ కళాకృష్ణ గారు, నవజనార్దన పారిజాతం గురించి మాట్లాడుతూ, అసలు సత్యభామను, తెలుగు వారు నృత్యంలో యెందుకు ప్రవేశ పెట్టారు. లక్ష్మి, సరస్వతి జడ ను పెట్టుకోవటానికి నిరాకరించితే, సత్యభామ అంగీకరించటం వలన, ఆమె న్రుత్యం లోనికి ప్రవెసింపబడింది. ఒక సామాన్య మానవుడికి ఆలు మగల మధ్య వుండాల్సిన అన్యోన్యత,అనుబంధాలు తెలియ జేయడానికి పూర్వీకులు నృత్యాన్ని సాధనంగా ఎన్నుకున్నారు. ప్రేమ, మరియు దగ్గరితనం కోసం అన్నమాట.  కూచిపూడి, తూర్పు భాగవతం, భామాకలాపం, దేవదాసీలు దేవాలయంలో చేసే నృత్యాలు భావ జ్ఞానమునకు ప్రధానంతో, నాలుగు రకాలని పెద్దలు చెబుతారు. సత్యభామా కలాపం నేర్చుకుంటే, భరతుని నాట్య శాస్త్రం చదవాల్సిన అవసరం లేదు అన్నారు. రాగ జ్ఞానానికి తూర్పు భాగవతం ప్రతీక అన్నారు. విరహావస్థలో, దుఖావస్థలో తాళం మారిపోతుంటుంది. దశప్రాణాలు తెలిసిన తరువాతలెక్కలు నేర్చుకోవాల్సిన అవసరంలేదు అన్నారు. "జనులార వినుడీ  .....ఘనునకు".. మూడు స్థాయిలూ లేవు.

నవజనార్ధనం గోదావరి తీరాన "జనార్దన స్వామీ" ఆలయాలు వుండటం, ఉత్సవాల్లో రధం వెళ్లేముందు యీ నాట్య ప్రదర్సన వుండేదట. 
110 సంవత్సరాల క్రిందటి విషయంట.   ఆరుగొలను లో 1900-99 మధ్యలో రజనీకాంత రావు గారి మేనత్త "పెండేటి సత్యభామ గారు" 9 రోజుల ప్రదర్శనగా ఇచ్చే వారుట. నాట్యశాస్త్రం మొత్తం అందులో చొప్పించారు అన్నారు. అష్టవిధ నాయికలు, మన్మధావస్థ ఎలావుంటుందీ, అన్ని వివరంగా వుంటాయి అన్నారు. స్వాధీనపతిక, అంటే నాభర్త నా చెప్పు చేతల్లో వుండాలి అనుకోవటం. స్వీయ, పరకీయ పతిక వీటి గురించి చెప్పారు. పదవ రోజున మళ్ళీ తీసుకుని వచ్చి కూర్చునే వారుట. వారు నట్టువాంగం చేస్తూ, శిష్యురాలితో అభినయం జరిపించారు. అమలాపురం వైపు సూత్రధారుడు సత్య-క్రిష్నుల మధ్యన mediator గా ఉండేవారుట. 
"భామని పిలతురే" అనే వినికిడి దరువు - కుమారి సాత్విక అభినయించారు. 
దరువు సాంప్రదాయంలో వర్ణం ఫొర్మత్ తో చేస్తే
అభినయం మొదలు
నృత్యం 
నౄత్తం తో వికసిస్తుంది 
అభినయ దరువు 
ఆట దరువు - రావే మాధవి, రావే సఖియ..రావమా..

రామేస్వరుని నన్ను అంగజుని బారువు..  
ఎక్కడైనా మొదలుపెట్టవచ్చును, .....ప్రవేశ దరువు తోనే చేయాలని లేదు.   
పున్నమ చంద్రుడు....కమలజనే....దరువు..
ఓయమ్మ లార...అదుగో...చంద్రుడు...ఉదయం...బాయెనే...

మదన పాయం..........
మందులాడిన సవతికి 
మందుబెట్టిన ....తానబడే..
"అహం" అన్నది పోయి విజ్ఞానవంతుడుని  చేయటానికి...............
ఏదమ్మ నాధుడు...ఇందరిలోన ..
"లాంతరు పట్టుకుని"...సత్యభామ వెడుతుంది...
అందుకని లాంతరు పట్టుకుని వెళ్ళినట్లు చేయాలి అన్నారు..
నటరాజ రామక్రిష్ణ గారికి జనార్ధన శర్మ గారు చెపారుట.....అలానే చేస్తారు... అన్నారు..
ము...ముదముతో శ్రీ మువ్వమదన గోపాలుడు 
సాకారముతో సంగతి మరచేను...
అంతర ఏడమ్మ నా నాధుడు...
పాటతో పాటు.. గతి కూడ మారుతుంది...
త్రిశ్ర - చతురశ్ర లోనికి మారుతుంది...
I
ఈ  సౌందర్య గర్విత-
ప్రేమ గర్విత.
ధన గర్విత...
విద్యా గర్విత... 
సత్యభామ - క్రిష్నుడు కలిస్తే భకి-రక్తి...

సామాన్యులకి ఒకలాగా-విద్యావంతులకి మరొకలాగా ఉండేల ...
శంఖం - .....చక్రం....
నేచెప్పలేనే....మగని పేరు...
పేరు చెప్పలేనే ప్రేమతో..
రూపురేఖలనీ...."నే.."

అమరకోశం - స్లోకం లోని 2ంద్ అక్షరం తీసుకుని  - సారంగ ...........రెండో అక్షరం - అతని పేరు చెప్పిస్తుంది మాధవి... 
దువ్వ - నెల్లూరు ల్లో  రాయబారం...
II
జడవేసి చేమంతులు వేసి సత్యభామ ని కొట్టమంటే కొట్టాడు ఆ జడతో...
కోపం వచ్చి  వెళ్ళిపోతాడు...

పడక గదిలో......జడ యొక్క విషిశ్టత ,,,
ఖండితావస్తలో చూపిస్తుంది...
జదతో..కొడతారా...
అంటుంది....ఆ కోపం కొద్దీ..

శౄంగారంలో భాగవతంలో 
నువా...నేనా... అందంగా ఉన్నానా అని నట్లుగా చూపించారు.

నా వక్షస్థలం మీద నిన్ను ఎత్తుకోలేదా!!
నేనూ గొప్ప దాన్నే అంటుంది!!
మొదటి రోజు - భామనే సత్య భామనే...వరకూఉ
రెండవ రోజు భామరో...నుంచి మదన జనకుని వరకూ..
మూడవ రోజు - 3 రకాల దరువులూ....- చేస్తారు..
అభినయంలో....
పాద పద్మములు ....అలసిపోయెనే...
నెమ్మదిగా లేవటం....అలసిపోయి...
ఇవన్నీ అవస్థలు తెలుపుతాయి...
సత్యభామ ఒక అమూల్యమైన పాత్ర...

సత్యభామ - స్వాధీన భతౄక 
రాధ - సాత్విక నాయికా
........................................................అని ముగించారు..
ఉషా గాయత్రి గారు అథిది గా విచ్చేసారు

ఈ మూడు రకాల నాట్యాలూ తన థెసిస్ లో చేసానని చెప్పరు. 
తూర్పు భాగవతం ఒక రుస్తిచ్ ప్రెసెంతతిఒన్ అన్నారు.

గురువు - వేరే ఒక గురువు కి తన శిష్యులని ఐందిరా హేమ ందజేయాలి అన్నారు.


ఉషా గాయత్రి కలిసి నేర్చుకున్నారని అన్నారు.
2010 లో మూడు కలాపాలు  చేసాను అన్నారు.
కూచిపూడి - వెంకు, వేదాంతం
తూర్పు భాగవతం - కళాక్రిష్ణ గారు
కలాపాలు - దరువులు.............
లైట్లు పెట్టి, తెర వెనుక - కలాపం చేసారనీ...తెలిపారు..
3 ప్రక్రియలూ తన థెసిస్ లో ఉన్నాయి....అన్నారు

వేదాంతం జగన్నాధ శాస్త్రి గారు
నటరాజ రామ క్రిష్ణ గారు నేర్పారని అన్నారు!!
.................................................................................










No comments:

Post a Comment